అన్వేషించండి

YSRCP : మద్దతు ఇస్తే మైనార్టీలకు కోపం - ఇవ్వకపోతే బీజేపీకి ఆగ్రహం ! ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై వైఎస్ఆర్‌సీపీ విధానమేంటి ?

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు వైఎస్ఆర్‌సీపీ మద్దతు ఇస్తుందా ?బిల్లుకు మద్దతిస్తే మైనార్టీలు దూరమయ్యే అవకాశంమద్దతు ఇవ్వకపోతే బీజేపీ ఆగ్రహానికి గురయ్యే ప్రమాదంజగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు ?

YSRCP :  ఉమ్మడి పౌరస్మృతి చట్టం దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును తీసుకురానుంది. ఈ మేరకు.. న్యాయవ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పౌరులు అందరికీ ఒకే చట్టం ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దేశ ప్రజలందరికీ ఒకే పౌర చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో ఉంది. అందుకే.. ఉమ్మడి పౌరస్మృతి చట్టానికి సంబంధించి వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని చూస్తోంది మోదీ సర్కార్‌. 

మైనార్టీలను టార్గెట్ చేసుకుని తెస్తున్నారని విమర్శలు

యూనిఫాం సివిల్ కోడ్ అంశం పూర్తిగా మైనార్టీ వర్గాలను టార్గెట్ చేసుకుని తెస్తున్నారన్న ఓ ప్రాచరం జోరుగా సాగుతోంది. దీనిపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. అంగీకరించే ప్రశ్నే లేదన్నారు ఒక్క మజ్లిస్ మాత్రమే కాదు.. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. చివరికి బీజేపీ మిత్రపక్ష పార్టీగా ఉన్న అన్నాడీఎంకే కూడా  వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ బిల్లుపై మైనార్టీల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ బిల్లుతో ముస్లిం కుటుంబ చట్టాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న భావన ఏర్పడటంతో ఆ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కానీ కేంద్రం ఈ బిల్లును ఆమోదించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. 

రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీ మద్దతు కీలకం

ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పార్లమెంట్ లో బయటపడాలంటే..రాజ్యసభలో బీజేపీ ఇతర పార్టీల మద్దతు పొందాల్సి ఉంటుంది. లోక్ సభ విషయానికి వచ్చే వరకూ  బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రాజ్యసభకు బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. ఎన్డీఏకు కూడా లేదు. నేరుగా మద్దతు ప్రకటించకుండా.. రహస్య మిత్రులుగా ఉన్న పార్టీల  మద్దతు కావాలి. బీజేప ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సమర్థించే బీజేడీ, వైసీపీ వంటి పార్టీల మద్దతు కీలకం. తెలుగుదేశం పార్టీకి ఒక్క రాజ్యస సభ్యుడే ఉన్నారు. ఆ ఒక్క ఓటుతో చేసేదేమీ లేదు.కానీ వైసీపీకి 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓటింగ్‌లో వీరు చాలా కీలకం. 

మద్దతు ఇస్తే ముస్లింలు దూరమయ్యే ప్రమాదం ! 

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు మద్దతు ఇస్తే ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. వైసీపీకి ముస్లింలు ప్రధానమైన ఓటు బ్యాంకు. ఇప్పటి వరకూ బీజేపీతో అంటకాగుతున్నా ముస్లింలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న కొన్ని రకాల సమస్యల వల్లేనే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఇప్పుడు తమ అస్తిత్వాన్ని ఇబ్బంది పెట్టే బిల్లుకు జగన్ మద్దతిస్తే వారు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే వైసీపీ ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. 

మద్దతు ఇవ్వకపోతే బీజేపీ దూరమయ్యే ప్రమాదం !

ఒక  వేళ మద్దతివ్వబోమని చెబితే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా విశ్వాసంలోకి తీసుకునే అవకాశం ఉండదు. అది జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాల్లోనూ ఇబ్బందికరమేనన్న అభిప్రాయం ఉంది.  అందుకే వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి మద్దతు ఇస్తానంటే మైనార్టీలకు కోపం... ఇవ్వనంటే  బీజేపీ ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

TPCC Showcause Notice: టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
YS Jagan Local Body Elections Strategy 2026: గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget