Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !
తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఏమిటంటూ సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమయింది. దీనికి కారణం సాగర హారంపై కేటీఆర్ చేసిన ట్వీటే.
Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో సాగరహారానిదో ప్రత్యేకత. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాగరహారం ద్వారా నలు దిశలా తెలిసేలా చేసిన సందర్భం అది. ఆ సమరానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి కేటీఆర్ కొన్ని జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అదే సమయంలో ప్రతిరోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్ కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ? అని ప్రశ్నించారు.
సాగరహారానికి నేటితో పదేళ్లు
— KTR (@KTRTRS) September 30, 2022
తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం.. లక్షల గొంతుకలు 'జై తెలంగాణ' అని నినదించిన రోజు.
ప్రతిరోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్ కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ? pic.twitter.com/3nNLVtlCiH
వెంటనే రేవంత్ రెడ్డి స్పందించారు.చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయvf..తెలంగాణ ఉద్యమం సకల జనులది. సాగర్ హారం ఆ జనుల తరపున ప్రాతినిధ్యం వహించిన జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది.. నాడు ఉద్యమం పై…నేడు రాష్ట్రం పై పడి బతకడం మీకు అలవాటైపోయిందని కౌంటర్ ఇచ్చారు.
చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయి.
— Revanth Reddy (@revanth_anumula) September 30, 2022
తెలంగాణ ఉద్యమం సకల జనులది.
సాగర్ హారం ఆ జనుల తరపున ప్రాతినిధ్యం వహించిన జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది.
నాడు ఉద్యమం పై…నేడు రాష్ట్రం పై పడి బతకడం మీకు అలవాటైపోయింది. https://t.co/lXvxL4rqQV pic.twitter.com/IGLtL4z2ha
ట్వీట్‌లో కేటీఆర్ ప్రస్తావించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్పందించారు. తమరు అప్పుడు ఆంధ్ర పెత్తందార్ల ఫాంహౌసుల్లో విందుల్లో మునిగి తేలుతూ ఉంటే,నేను తెలంగాణ విద్యార్థి బిడ్డల ప్రాణాలను నాటి ఆంధ్ర పోలీసుల నుండి కాపాడానని.. ,అమరుల శవాలను మోశానన్నారు. మీరేమో తెలంగాణ ఆస్తిని మళ్లీ మెఘా లాంటి ఆంధ్ర గుత్తేదారులకు అప్పజెబుతున్నారని విమర్శించారు.
అయ్యా ట్విట్టర్ పిట్ట @KTRTRS , తమరు అప్పుడు ఆంధ్ర పెత్తందార్ల ఫాంహౌసుల్లో విందుల్లో మునిగి తేలుతూ ఉంటే,నేను తెలంగాణ విద్యార్థి బిడ్డల ప్రాణాలను నాటి ఆంధ్ర పోలీసులనుండి కాపాడిన,అమరుల శవాలను మోసిన భై..మీరేమో మా తెలంగాణ ఆస్తిని మళ్లీ మెఘా లాంటి ఆంధ్ర గుత్తేదారులకు అప్పజెప్పిండ్రు. https://t.co/yamJR5wRLR
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) September 30, 2022
ఉద్యమ సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నారని.. ఆయన పాత్ర ఏమీ లేదని వస్తున్న విమర్శలకు కూడా కేటీఆర్ వేరే పోస్టుల ద్వారా సమాధానం ఇచ్చారు.
This September marks completion of 16 years in public life for me😊
— KTR (@KTRTRS) September 30, 2022
Lots of memories from #Telangana agitation for 8 years followed by 8 plus years in Govt
Grateful to people of Telangana for their unstinting support & all the hardworking @trspartyonline grassroots leaders 🙏 pic.twitter.com/cSptDWZ3jY
కేటీఆర్ సాగరహారం పేరుతో చేసిన ట్వీట్‌తో తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఎంత అనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.