అన్వేషించండి

Andhra Politics : మూడు రాష్ట్రాల దిశగా ఏపీ పయనిస్తోందా ? సీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు పెరగడం దేనికి సంకేతం ?

ఏపీలో అటు రాయలసీమలో ఇటు ఉత్తరాంధ్రలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ ఏపీ ప్రాంతీయ రాజకీయ గుప్పిట్లో చిక్కుకున్నట్లు అవుతోంది.

Andhra Politics :   ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వివాదం క్రమంగా మూడు రాష్ట్రాల ఉద్యమంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాంతాల పేర్లతో రాజకీయ పార్టీలు కూడా పెడుతున్నారు. ఇటీవల వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలోని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడారు. ఆయన అలా మాట్లాడి వారం కాక ముందే అప్పుడే జై ఉత్తరాంధ్ర పేరుతో ఓ పార్టీ ని పెట్టేందుకు కొంత మంది సన్నాహాలు చేస్తున్నారు. సమావేశాలు ప్రారంభించారు. ఇప్పటికే రాయలసీమలోనూ ప్రత్యేక వాదం వినిపిస్తోంది. గతంలోనే అక్కడ ప్రత్యేక  రాష్ట్రం కోసం పార్టీలు ప్రారంభమయ్యాయి. ఏపీ చివరికి మూడు రాష్ట్రాలుగా విడిపోయే పరిస్థితి వస్తుందా  అనేలా ప్రస్తుత పరిణామాలు ఏర్పడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. 

జై ఉత్తరాంధ్ర పేరుతో కొత్త పార్టీ 

జనసేన తరపున గతఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన మెట్ట రామారావు అనే నేత తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కానీ హఠాత్తుగా ఆయన జై ఉత్తరాంధ్ర అనే పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన లాంటి పార్టీ తరపున పోటీ చేసినప్పటికి ఆయనకు పార్లమెంట్ నియోజకవర్గం  మీద మొత్తం ముఫ్పై వేల ఓట్లకు కాస్త ఎక్కువగానే వచ్చాయి. అయినప్పటికీ ఆయన ఇటీవల ఉత్తరాంధ్రలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన జై ఉత్తరాంద్ర పేరుతో పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ పార్టీ ఉద్దేశం ప్రత్యేక రాష్ట్ర సాధన అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశాఖను రాజధానిగా చేయడం లేకపోతే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేయండి అన్న ధర్మాన వ్యాఖ్యల తర్వాతే రామారావు ప్రత్యేక పార్టీ గురించి.. తన కసరత్తు గురించి మీడియాకు తెలిసేలా చేయడం ఆసక్తి రేపుతోంది. 

రాయలసీమలో క్రమంగా పెరుగుతున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ 

నిజానికి రాయలసీమలోనూ ప్రత్యేక రాష్ట్ర వాదం ఉంది. అసలు రాజధాని మార్చాల్సి వస్తే అది కర్నూలులోనే ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు ఎదుకంటే విశాల ఆంధ్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో మొదట  కర్నూలే రాజధానిగా ఉండేది. తర్వాత  హైదరాబాద్ కు మార్చారు. అందుకే కర్నూలు రాజధాని అనేది తమ హక్కు అని రాయలసీమ వాసులు భావిస్తారు. అదొక్కటే కాదు.. వివిధ కారణాలతో రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర వాదం ఉంది. గతంలో రాయలసీమ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక రాయలసీమ సాధన కోసం ప్రత్యేక పార్టీ పెట్టారు. కానీ ప్రజల నుంచి అనుకున్నంత స్పందన రాకపోవడంతో ఆయన పార్టీని రద్దు చేసుకున్నారు. కానీ ఇటీవలి కాలంలో  .. ముఖ్యంగా  మూడు రాజధానుల వివాదం తెరపైకి వచ్చిన తర్వాత రాయలసీమ రాష్ట్రం గురించి అక్కడా చర్చ జరుగుతోంది. 

అమరావతి అభివృద్ధి కాక ముందే రాష్ట్ర విభజన వాదాలు !

ఏకైక రాజధానిని అభివృద్ధి చేస్తే మళ్లీ హైదరాబాద్ లా అవుతుందని... మళ్లీ విభజన వాదం వస్తుందని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ పెద్దలు చెబుతూంటారు. అయితే ఇప్పుడు అమరావతి అభివృద్ధి కాకుండానే  విభజన వాదం  వచ్చేసింది. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర నుంచి  తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్లు ప్రారంభమయ్యాయి. అయితే వీటికి ఎంత ప్రజా మద్దతు ఉందనేది చెప్పడం కష్టం. ఇలాంటి డిమాండ్లు చేస్తున్న వారు ఎంత ఎక్కువగా ప్రజల మద్దతు కూడగట్టగలిగితే వారి డిమాండ్ కు అంత బలం లభిస్తుంది. లేకపోతే.. ఈ డిమాండ్లు ఎన్నికల వరకూ వినిపిస్తారు. తర్వాత మళ్లీ సైలెంటయ్యే అవకాశాలు ఎక్కువ. 

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget