అన్వేషించండి

Defection MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌కు తలనొప్పి - చేరికలతో వ్యూహాత్మక తప్పిదం చేశారా?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలే సమస్యగా మారారు. వారిపై అనర్హతా వేటు పడకుండా ఉండటానికి వారు తమ పార్టీ కాదని చెప్పారు. చాలా మంది అదే నిజం చేస్తున్నారు.

Defection MLAs problems For Telangana Congress:   తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు  మింగుడు పడని మెతుకులా మారింది. బలమైన ప్రతిపక్షం లేకుండా చేయాలనే వ్యూహంతో బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్  పెద్దలకు, ఇప్పుడు వారే రాజకీయంగా పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. వారిపై అనర్హతా వేటు పడకుండా.. వారు తమ పార్టీ కాదని చెబుతున్నారు. ఆ పది మందిలో చాలా మంది అదే నిజం చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఈ ఎమ్మెల్యేల ద్వంద్వ వైఖరి పార్టీ క్యాడర్‌లో గందరగోళాన్ని సృష్టిస్తోంది.

కాంగ్రెస్‌కు దూరం దూరం

పటాన్ చెరు, గద్వాల వంటి నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి సహకరిస్తామనే సంకేతాలు ఇవ్వడం కాంగ్రెస్ హైకమాండ్‌ను విస్మయానికి గురి చేస్తోంది. ఇది కేవలం ఒక నియోజకవర్గానికో పరిమితం కాకుండా, మెజారిటీ ఫిరాయింపు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

పార్టీలోనే ఉన్న వారితో కొత్త సమస్యలు 

జగిత్యాల వంటి చోట్ల ఎమ్మెల్యేలు సాంకేతికంగా కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ, పాత కాంగ్రెస్ కార్యకర్తలకు, ఈ కొత్త నేతలకు మధ్య సమన్వయం కుదరడం లేదు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన నాయకులు, ఇప్పుడు తమ ప్రత్యర్థుల కింద పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ఈ అంతర్గత పోరు వల్ల పార్టీ సంస్థాగతంగా బలహీనపడుతోంది. ఈ పరిణామాలను గమనిస్తుంటే, ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్ చేసిన ఒక వ్యూహాత్మక తప్పిదంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దానం నాగేందర్ అంశాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక తంటాలు ! 

మరోవైపు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం పార్టీకి ఒక పరీక్షగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన భవిష్యత్ అడుగులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు ఆయనతో రాజీనామా చేయించి ఉపఎన్నికకు వెళ్లడమా, లేక అనర్హత వేటు పడే వరకు వేచి చూడటమా అనే సందిగ్ధంలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ ఉపఎన్నికలు వస్తే, అవి ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా మారుతాయనే భయం కూడా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.

ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల అన్నీ సమస్యలే ! 

రాజకీయంగా బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలనే ఆత్రుతలో, సరైన వడపోత లేకుండా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ తన సొంత అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసుకుంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటామని చెప్పే కాంగ్రెస్, ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రజల్లో ఉన్న నైతిక బలాన్ని కొంత కోల్పోయిందని చెప్పవచ్చు. ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు అటు బీఆర్ఎస్ కార్యకర్తలను మెప్పించలేక, ఇటు కాంగ్రెస్ శ్రేణులతో కలవలేక సతమతమవుతున్నారు.  రాబోయే మున్సిపల్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని భావించిన అధిష్టానానికి, ఇప్పుడు ఉన్న స్థానాలను కాపాడుకోవడం కూడా సవాల్‌గా మారింది. ప్రజలు కూడా ఫిరాయింపుల రాజకీయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ ఈ  ఫిరాయింపు కష్టాల నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget