(Source: ECI/ABP News/ABP Majha)
మునుగోడు ఎన్నికల్లో కీలక మలుపు- టీఆర్ఎస్‌కు కలిసి వస్తుందా?
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కే మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించింది. ఈ బంధం వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగుతుందని చాడ వెంకటరెడ్డి ప్రకటించారు.
Munugode CPI : మునుగోడు ఉపఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన సీపీఐ మద్దతు టీఆర్ఎస్‌కే లభించింది. గతంలో పలుమార్లు ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రికార్డు ఉన్న సీపీఐ ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో టీఆర్ఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించింది. బీజేపీని ఓడించే సత్తా టీఆర్‌ఎస్‌కే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలో తాము టీఆర్‌ఎస్‌కు మద్దుతు పలుకుతున్నామని చెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌తో కలిసే పోటీ
మునుగోడు ఉపఎన్నికపై హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం తర్వాత చాడా వెంకట్‌రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించారు. ఉపఎన్నికల్లో సీపీఐ పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. అందువల్ల బీజేపీని ఓడించే పార్టీకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇది మునుగోడుకే పరిమితం కాదని, భవిష్యత్‌లో కూడా టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ప్రగతి భవన్‌లో రెండు గంటల పాటు కేసీఆర్‌తో చర్చ
ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను సీఎం కేసీఆర్ కోరారు. శుక్రవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి.. ముఖ్యమంత్రితో ప్రగతిభవన్‌లో 2 గంటలపాటు చర్చించారు.శనివారం పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మునుగోడులో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభకు రావాలని కేసీఆర్ కోరినట్లు తెలిపారు. సీపీఐ తరపున పల్లా వెంకట్ రెడ్డి.. కేసీఆర్ సభలో పాల్గొంటారన్నారు.
వేల మంది పోలీసులు - ఫుల్ సెక్యూరిటీ ! స్టాండప్ కామెడీకి సీరియస్ ఏర్పాట్లు ! అయినా ఏం జరుగుతుందో ?
బీజేపీని ఓడించడమే లక్ష్యమన్న సీపీఐ
తన స్వార్థ ప్రయోజనం కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అందుకే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. కాంగ్రెస్ పరిస్థితి, క్రేడిబిలిటి, ఉనికిపై మాట్లాడదలచుకోలేదన్నారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమను ఇబ్బంది పెట్టిందని చెప్పారు. తమకు కేటాయించిన మూడు సీట్లలో కూడా వారి అభ్యర్థులు పోటీచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
టీఆర్ఎస్‌కు అదనపు బలం
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీకి అదనపు బలం చేకూరినట్లయింది. అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా సీపీఐ పార్టీకి కనీస ఇరవై వేల వరకూఓట్లు వస్తాయి. ఇతర పార్టీలతో పొత్తు ఉంటే విజయం సాదించేవారు. అయితే ఇటీవలి కాలంలో ఆ పార్టీ బలహీనపడింది. దీంతో.. మునుగోడు ఉపఎన్నిక ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు కొనసాగించాలని భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు - ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు ?