అన్వేషించండి

KCR Resignation Demand Congress: కేసీఆర్ రాజీనామా డిమాండ్ వెనుక కాంగ్రెస్ మైండ్ గేమ్ - అనర్హత వేటు వేసే ధైర్యం ఉందా?

Revanth Reddy Vs KCR Telangana: కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ మహాధర్నా చేసింది. రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హతా వేటు వేయవచ్చు. మరి కాంగ్రెస్ ఆ పని చేస్తుందా?

KCR Disqualification Rule Assembly:  తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య రాజకీయం పీక్స్‌కు చేరింది. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరుకావడం లేదని, ప్రజాధనం నుంచి జీతభత్యాలు పొందుతూ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద  మహా ధర్నా కు దిగింది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉంటూ బాధ్యతను విస్మరించినందుకు కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. అయితే, ఇక్కడే ఒక ప్రధానమైన రాజ్యాంగ, రాజకీయ ప్రశ్న ఉత్పన్నమవుతోంది నిజంగానే కేసీఆర్ గైర్హాజరును ప్రభుత్వం తప్పుపడితే, రాజీనామా చేయాలని ధర్నాలు చేయడం ఎందుకు? రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేసే చట్టపరమైన అధికారం అధికార పక్షానికి ఉండి కూడా ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదు?

అనర్హతా వేటు అవకాశం కాంగ్రెస్ చేతుల్లోనే!

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం, సభ అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు ఏ సభ్యుడైనా శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోతే, స్పీకర్ లేదా సభ ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించి, అనర్హత వేటు వేసే అవకాశం చట్టబద్ధంగా ఉంది. అయితే, ఈ 60 రోజుల లెక్కింపులో సభా ప్రాంగణం వాయిదా పడిన రోజులు లేదా వరుసగా నాలుగు రోజులకు పైగా సభ రద్దయిన కాలాన్ని మినహాయిస్తారు. కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొన్ని కీలక సందర్భాల్లో అసెంబ్లీకి వచ్చి ప్రమాణస్వీకారం చేయడం, బడ్జెట్ సమావేశాలు, శీతాకాల సమావేశాల సమయంలో స్వల్ప సమయం హాజరుకావడం ద్వారా సాంకేతికంగా ఈ 60 రోజుల లెక్కింపు నిబంధనలోకి రాకుండా తన సభ్యత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

అనర్హతా వేటు  వేస్తే సానుభూతి  వస్తుందని ఆగుతున్నారా? 

అంతేకాకుండా, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 60 రోజుల నిబంధనను సాకుగా చూపి ,  సాంకేతిక కారణాలతో కేసీఆర్‌పై అనర్హత వేటు వేస్తే, అది రాజకీయంగా కాంగ్రెస్‌కే ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందనేది విశ్లేషకుల అంచనా. తెలంగాణ ఉద్యమకారుడిగా, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక దిగ్గజ నేతపై అనర్హత వేటు వేస్తే.. అది బిఆర్ఎస్‌కు తీవ్రమైన  సానుభూతి    రాజకీయ ఆయుధంగా మారుతుంది. "తెలంగాణ తెచ్చిన నాయకుడిపై కక్షసాధింపు చర్యలు దిగుతున్నారు" అని బిఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లి సెంటిమెంట్‌ను రగిల్చే అవకాశం ఉంటుంది. అందుకే చట్టపరమైన అనర్హత వేటు జోలికి వెళ్లకుండా, కేవలం రాజకీయంగా ఒత్తిడి తెచ్చే వ్యూహాన్నే కాంగ్రెస్ ఎంచుకుంది.

బీఆర్ఎస్‌ను  ఆత్మరక్షణలోకి నెట్టే మైండ్ గేమ్ 

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై బిఆర్ఎస్ ఎక్కుపెట్టబోయే అస్త్రాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ వేసిన ముందస్తు డిఫెన్సివ్ స్కెచ్ గా ఈ మహాధర్నాను చూడవచ్చు. సభలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారెంటీల అమలుపై బిఆర్ఎస్ నిలదీయక ముందే..  అసలు మీ ప్రధాన నాయకుడే సభకు రావడం లేదు, చర్చల్లో పాల్గొనడం లేదు అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆత్మరక్షణలో పడేయడం కాంగ్రెస్ వ్యూహం. ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా బిఆర్ఎస్ నైతిక బలాన్ని దెబ్బతీయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.  మరోవైపు బిఆర్ఎస్ వర్గాలు మాత్రం కాంగ్రెస్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని , అసెంబ్లీలో ఫేస్ చేయలేకనే ఇలాంటి 'రాజీనామా డ్రామాలకు' తెరలేపిందని బిఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.  

అంతా పొలిటికల్  మైండ్ గేమే 

 కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ చేస్తున్న ధర్నాలు కేవలం పొలిటికల్ మైండ్ గేమ్  మాత్రమే. చట్టపరమైన అనర్హత వేటు వేస్తే వచ్చే రాజకీయ పరిణామాలను తట్టుకోవడం కష్టం కాబట్టే, కాంగ్రెస్ చట్టపరమైన చర్యల కంటే రాజకీయ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. శాసనసభ వేదికగా ఇరు పక్షాల మధ్య జరగబోయే ఈ రాజకీయ యుద్ధం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Vision 2046: అమరావతికి 20 ఏళ్ల మహా ప్రణాళిక.. రూ. 1.33 లక్షల కోట్ల బడ్జెట్, ఖజానాపై పైసా భారం లేకుండా సెల్ఫ్-సస్టైనబుల్ వ్యూహం!
అమరావతికి 20 ఏళ్ల మహా ప్రణాళిక.. రూ. 1.33 లక్షల కోట్ల బడ్జెట్, ఖజానాపై పైసా భారం లేకుండా సెల్ఫ్-సస్టైనబుల్ వ్యూహం!
CM Revanth Reddy Siddipet Meeting : గులాబీ కంచుకోటలో హస్తం దండయాత్ర: రేవంత్ సభకు ముందే హరీశ్ విమర్శల ఎటాక్ - సిద్దిపేటలో రాజకీయం రాజుకుందా?
గులాబీ కంచుకోటలో హస్తం దండయాత్ర: రేవంత్ సభకు ముందే హరీశ్ విమర్శల ఎటాక్ - సిద్దిపేటలో రాజకీయం రాజుకుందా?
Telangana Cabinet Reshuffle 2026: మూడేళ్ల పాలన వేళ కేబినెట్ ప్రక్షాళన వేడి - టీం రేవంత్‌కు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
మూడేళ్ల పాలన వేళ కేబినెట్ ప్రక్షాళన వేడి - టీం రేవంత్‌కు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
YSRCP 70 Constituency Incharges Change : 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. ఆర్థిక బలవంతులు దొరుకుతారా?
70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. ఆర్థిక బలవంతులు దొరుకుతారా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget