అన్వేషించండి

Congress Nalgonda: మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !

Msui Politics : మూసిని వ్యతిరేకిస్తే నల్లగొండను వ్యతిరేకించినట్లేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది.

Congress is campaigning that opposing Musi is like opposing Nalgonda: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక్క అంశం చుట్టూ తిరగడం లేదు.  ప్రతి రోజూ రాజకీయం చేసుకోవడానికి చాలా టాపిక్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి మూసి ప్రక్షాళన. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఆరోపణలు..కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తాజాగా అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రెసివ్ గా ముందుకెళ్తోంది. అందుకు కాంగ్రెస్ పార్టీకి దొరికిన ఆయుధం.. నల్లగొండ. దీంతో బీఆర్ఎస్ కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 

మూసి ప్రక్షాళన వ్యతిరేకిస్తే నల్లగొండకు అన్యాయం చేసినట్లే ! 

కాంగ్రెస్ పార్టీ నల్లగొండ సెంటిమెంట్‌ను పండించి.. బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  మూసి ప్రక్షాళనను వ్యతిరేకిస్తే అది నల్లగొండ ప్రజల్ని వ్యతిరేకించినట్లే అన్న భావన తీసుకు వచ్చేందుకు  వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పరిధిలో పుట్టిన రోజున రోజు నాడు పాదయాత్ర చేయబోతున్నారు. మూసి ప్రాంత ప్రజలతో పాటు మూసి కాలుష్యం వల్ల పడుతున్న ఇబ్బందుల్ని ఆయన పరిశీలిస్తారు. పాదయాత్రకు నల్లగొండజిల్లాలోని మూసీ ప్రాంతాలను రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఎంచుకున్నారని అర్థమయిపోతుంది. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా నేతలంతా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు

మూసిపై బీఆర్ఎస్ వాదనపై విమర్శలు   

ఇప్పటికే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా మూసి ప్రక్షాళనను అడ్డుకంటే నల్లగొండ ప్రజలు ఊరుకోరని హెచ్చరిస్తూ వస్తున్నారు. నల్లగొండ ప్రజల్ని ఎందుకు హింసిస్తారని మూసి విషం ఎందుకు నల్లగొండ జిల్లా ప్రజలు తాగాలని ప్రశ్నిస్తూ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు.  మూసి నది ఎక్కువగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రవహిస్తుంది. హైదరాబాద్ లో కలిసే మురికి , డ్రైనేజీ అంతా నల్లగొండకే వస్తోంది. దాని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మూసీ ప్రక్షాళన చేయకపోతే ఎక్కువగా నష్టపోయేది నల్లగొండ జిల్లా వాసులేనని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. 

కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?

అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకి అయినా నల్లగొండ కీలకం 

కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారానికి బీఆర్ఎస్  పార్టీ కూడా ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది.   తాము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని దానిలోని దోపిడీకే వ్యతిరేకం అంటున్నారు. అందుకే అడ్డుకుంటున్నామని అంటున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ వాదనను తిప్పి కొట్టేందుకు రెడీ అయ్యారు. అసలు పనులే ప్రారంభించక ముందు ఈ రకమైన దోపిడీ వాదనను ప్రజలు ఎందుకు అంగీకస్తారని.. పనుల్ని అడ్డుకోవడానికే ఇలా చేస్తున్నారని అనుకుంటారని అంటున్నారు. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకి అయినా నల్లగొండ జిల్లా కీలకం.  నల్లగొండ జిల్లాపై  ఆశలు వదులుకుంటే..మరోసారి అధికారంలోకి రావాలన్న  కల చెదిరిపోతుంది. అందుకే మూసి విషయంలో బీఆర్ఎస్ రాజకీయాన్ని కాంగ్రెస్ నల్లగొండ సెంటిమెంట్‌తో ఎదుర్కొంటోంది.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
Embed widget