అన్వేషించండి

BJP NEWS: ఆధారాలు, సాక్ష్యాల ప్రకారమే కవితపై చర్యలు - బీజేపీ ఎంపీ బండి సంజయ్

Bandi Sanjay Yathra: బీఆర్ఎస్- బీజేపీ ఒక్కటేనని అసత్య ప్రచారంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ మా కొంప ముంచింది. వాస్తవానికి వారిద్దరూ ఒక్కటేనని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ తోనే తాము పోటీపడతామన్నారు.

Bandi Sanjay: తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) ఒక్కటేనన్న  తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్(Congress) ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని..అదే తమ కొంపు ముంచిందని ఆ పార్టీ సీనియర్ నేత బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. తాము ఎప్పుడూ బీఆర్ఎస్(BRS) తో కలవబోమన్నారు. ఈసారి ఇలాంటి ఆరోపణలు చేసిన వారిని చెప్పుతో కొట్టాలని పిలుపునిస్తున్నట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 4,5 రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తామన్న సంజయ్....రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని....బీఆర్ఎస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రావాని ఆయన ఎద్దవే చేశారు
కొంపముంచారు
అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు, అబద్ధపు హామీలతో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్(Bandi Sanjay) విమర్శించారు.మలివిడత ప్రజాహిత యాత్రలో భాగాంగా హుస్నాబాద్ లో ఆయన పాదయాత్ర చేపట్టారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని....బీఆర్ఎస్(BRS) అడ్రస్ అసెంబ్లీ ఎన్నికల్లోనే గల్లంతయ్యిందని అన్నారు. గత ఎన్నికల్లో తాము, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస పార్టీ విష ప్రచారం చేసిందన్నారు. జనంలోకి బలంగా ఈ ప్రచారాన్ని తీసుకెళ్లిందని తెలిపారు. మరోసారి అలాంటి ప్రచారమే చేస్తోందన్న సంజయ్....ఇలాంటి ఆరోపణలు చేసినవారిని చెప్పుతో కొట్టాలని పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో కూడా బీజేపీ(BJP), బీఆర్‌ఎస్‌(BRS) ఒక్కటేనని ప్రచారం చేసి మా కొంప ముంచారంటూ మండిపడ్డారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. వారి అధికారాలను అనుసరించే అధికారులు తమపని తాము చేసుకుని పోతారని తెలిపారు. ఆధారాలు లభిస్తే ఎలాంటి వారినైనా వదిలిపెట్టరన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇవ్వడం చూస్తేనే అర్థమవుతుందని తాము, బీఆర్ ఎస్ ఒక్కటి కాదని తెలిపారు. 

కాంగ్రెస్-బీఆర్ఎస్సే ఒక్కటీ
వాస్తవంగా  కాంగ్రెస్ బి-టీమ్ బీఆర్ఎస్ అని బండి సంజయ్ ఆరోపించారు. యూపీఏ హయాంలో వారిరువురు చెట్టాపట్టాలేసుకుని తిరగారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్(KCR) కేంద్రమంత్రిగా పనిచేయగా....రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు మంత్రులుగా వెలగబెట్టారని చెప్పారు. 
తాము ఎప్పుడూ కలిసి పని చేయలేదని, కనీసం అధికారాన్ని కూడా పంచుకోలేదని తేల్చి చెప్పారు. అనవసరంగా  బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. గడిచిన ఐదేళ్లు కేసీఆర్ ఎప్పుడూ బీజేపీని, కేంద్రప్రభుత్వాన్ని ఆడిపోసుకున్నారని...కేంద్ర పథకాలు ఏవీ రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకున్నారని బండి సంజయ్ అన్నారు. అలాంటప్పుడు తాము, బీజేపీ ఒక్కటేనని ఎలా అంటారన్నారు.
వారంలో అభ్యర్థుల ప్రకటన
విజయ సంకల్ప యాత్రలకు మంచి స్పందన వస్తోందన్న బండి సంజయ్... వారం రోజుల్లో తెలంగాణలో వీలైనన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించబోతున్నామన్నారు.. కేంద్రంలో 370 పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుస్తామన్నారు.  తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ మూడోస్థానానికే  పరిమితమవుతుందన్నారు. బీఆర్ ఎస్ గ్రామాలవారీగా ఏం అభివృద్ధి చేసింది.. కేంద్రం ఏ మేరకు నిధులు ఇచ్చింది.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తదితర అంశాలతో ప్రజాహిత యాత్ర ప్రచారంలోకి వెళతామని, అలాగే నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేయాలన్న ఆలోచనతో యాత్ర కొనసాగిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

 

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Student Paper Leak Protest: విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
YSRCP Nellore Politics: నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Embed widget