అన్వేషించండి

Cockroach Janata Party: విపక్షంలో ఎజెండా సెట్టర్‌గా కాక్రోచ్ జనతా పార్టీ - అసలు పొలిటికల్ గేమ్ ఎవరిది?

Congress Agenda Setter: జాతీయ రాజకీయాల్లో ఎజెండా సెట్టర్‌గా కాక్రోచ్ జనతా పార్టీ. కాంగ్రెస్, కమ్యూనిస్టుల వైఖరి విపక్షాలకు మేలా? అధికార పార్టీకి వరమా?

Opposition Strategy Analysis:   భారత రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీకి బదులుగా,   కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ రాజకీయ ఎజెండాను నిర్దేశిస్తోంది.   పార్లమెంటు బయట, ప్రజాక్షేత్రంలో, సోషల్ మీడియాలో ఏ సమస్యపై పోరాడాలి? ఏ అంశాన్ని ప్రభుత్వంపైకి దాడికి వాడుకోవాలి? అనే ఎజెండాను కేజేపీ  , సంఘాలే ఖరారు చేస్తున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు , ఇతర విపక్ష కూటమి పార్టీలు స్వతంత్ర ఆలోచనలతో కాకుండా, వీరు నిర్దేశించిన ఎజెండానే గుడ్డిగా ఫాలో అవుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది.

సీజేపీకే ఎక్కువ ఫోకస్ వస్తోందా? 

  ప్రజా ఉద్యమాలు, విద్యార్థి ఆందోళనలు లేదా నిర్దిష్ట సామాజిక ఐడెంటిటీ పోరాటాలను ముందుండి నడిపించే విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ లాంటి చిన్న  సంస్థలు వేగంగా స్పందిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వారు వేసే ముందడుగును చూసి, తమ ఉనికి ఎక్కడ ప్రమాదంలో పడుతుందోనన్న భయంతో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా ఆ పోరాటాల్లోకి దూకుతున్నారు. దీనివల్ల విపక్షాల వైఖరి స్వతంత్రంగా కాకుండా, కేవలం  రియాక్టివ్ గా  ఎవరో లేవనెత్తిన అంశానికి ప్రతిస్పందించడం మాత్రమే మారిపోతోంది.  ఈ పరిణామం విపక్ష కూటమికి మేలు చేస్తుందా లేక తీవ్ర నష్టం కలిగిస్తుందా అనే దానిపై మేధావుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.  ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఎవరి ఎజెండా అయినా సరే, విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రావడం తాత్కాలికంగా కలిసొచ్చే అంశమే. కానీ, విశ్లేషణల లోతుల్లోకి వెళ్తే.. మధ్యస్థ, తటస్థ ఓటర్లను కాంగ్రెస్ వంటి సాంప్రదాయ పార్టీలకు దూరం చేసే ప్రమాదం కనిపిస్తోంది. 

అనుకూలంగా మల్చుకుంటున్న బీజేపీ 

అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కి మాత్రం ఈ పరిస్థితి రాజకీయంగా అత్యంత అనుకూలంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ తన సొంత జాతీయ ఎజెండాను పక్కనపెట్టి,  కాక్రోచ్ జనతా పార్టీ ,  కమ్యూనిస్ట్ ఎజెండాను భుజాన ఎత్తుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఎండగడుతోంది.  కాంగ్రెస్ భావజాలం పరంగా దిగజారిపోయిందని, అరాచక శక్తులు, అర్బన్ నక్సల్ తరహా గ్రూపుల చేతుల్లో రబ్బర్ స్టాంప్‌లా మారిందని  బీజేపీ నేతలు వేగంగా ప్రచారం చేస్తున్నారు. ఇది తటస్థ ప్రజామోదాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీకి ఒక బలమైన ఆయుధంగా ఉపయోగపడుతోంది.  కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు కూడా ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఒక శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ, కింది స్థాయి శక్తులు లేదా చిన్న గ్రూపుల వెనుక నడవడమేమిటనే ప్రశ్నలు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. 

రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకంలేదా ? 

దేశాన్ని ఏలేందుకు ప్రత్యామ్నాయ విజన్ చూపించాల్సిన ప్రధాన ప్రతిపక్షం, కేజేపీ వంటి సంస్థలు తెచ్చే నిరసనలపైనే ఆధారపడితే.. అది ఓటర్లలో కాంగ్రెస్ నాయకత్వ సమర్థతపై అనుమానాలను పెంచుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   జాతీయ రాజకీయాల్లో ఎజెండా సెట్టర్‌గా కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో రావడం వల్ల విపక్షాలకు వచ్చే రాజకీయ మైలేజ్ కంటే జరిగే నష్టమే ఎక్కువని స్పష్టమవుతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఇప్పటికైనా తమ సొంత ఎజెండాతో ముందుకు రాకపోతే రాజకీయంగా భారీ నష్టం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renuka Chowdhury at ABP Summit: దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
KTR Speech ABP Southern Rising Summit 2026 : రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget