News
News
X

Jagan Message To Modi : మరో అజెండా లేనే లేదని పదే పదే చెప్పిన జగన్ - మోదీకి సందేశం ఇచ్చారా ? ఏ విషయంలో ?

మరో ఎజెండా తమకు లేదని సీఎం జగన్ ప్రధాని మోదీకి సభా వేదికపై చెప్పారు. కేసీఆర్‌తో సాన్నిహిత్యం కారణంగా జగన్ మోదీకి ఈ వివరణ ఇచ్చారా ?

FOLLOW US: 

Jagan Message To Modi :  విశాఖపట్నంలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగసభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. తక్కువ సమయం అయినప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి చెప్పారు. అంతకు ముందే ప్రధాని మోదీతో తమకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. తమ మధ్య ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదన్నారు.  కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం.. పార్టీలకు, రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు. ఉండదు, ఉండబోదని ఖరాఖండిగా చెప్పారు. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలోనూ సీఎంవో అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. 

జగన్ లేదని చెప్పిన మరో అజెండా ఏమిటి ?

ఇంతకూ జగన్ చెప్పిన.. మరో ఎజెండా ఏమిటన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. మరో ఎజెండా లేదని చెబుతూ ఉంటుంది. అయితే ప్రధాని మోదీ ముందు  ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సీఎం జగన్ చెప్పారు. ఇలా ప్రత్యేకంగా మోదీకి చెప్పడానికి రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయ సంబంధాల ప్రకారం టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికీ సహకరించుకుంటూ ఉంటాయని చెబుతూంటారు. ఇటీవల గంగుల కమలాకర్ లాంటి మంత్రులు మీడియాతో మాట్లాడినప్పుడు... జగన్ కూడా కేసీఆర్ వెంట నడుస్తారని ప్రకటించారు. 

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌తో వెళ్లే ప్రశ్నే లేదని చెప్పారా ? 

News Reels

కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. వచ్చే నెలలో అధికారికంగా పేరు మారబోతోంది. ఆ తర్వాత  వివిధ రాష్ట్రాల్లో సొంతంగా పోటీ చేయడం లేదా ఆయా రాష్ట్రాల్లో బలమైన పార్టీలతో కలవడం వంటి వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో వైఎస్ఆర్‌సీపీతో కలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలూ అదే చెప్పడంతో.. ఢిల్లీ స్థాయిలో కూడా  బీఆర్ఎస్‌తో వైఎస్ఆర్‌సీపీ కలుస్తుందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. అందుకే ఈ విషయంలో సీఎం జగన్.. ప్రధాని మోదీకి క్లారిటీ ఇవ్వాలనుకున్నారని.. అందుకే తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో ఎజెండా  లేదని .. తాము జాతీయ రాజకీయాల వైపు రానే రామని మోదీకి జగన్ సభా వేదికగా క్లారిటీ ఇచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

బీజేపీతో విరోధాన్ని కోరుకోని వైఎస్ఆర్‌సీపీ

భారతీయ జనతా పార్టీతో కనీసం చిన్న వివాదం పెట్టుకునేందుకు కూడా ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ సిద్దంగా లేదు. అందుకే పోలవరం నిధులు, విభజన హామీైలు.. ఇతర అంశాల్లో గత ప్రభుత్వం కేంద్రంపై పోరాడినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు. కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటున్నారు. పార్లమెంట్‌లో ప్రతీ బిల్లుకూ మద్దతు తెలుపుతున్నారు. అయితే ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి టీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తూండటంతో ఆ పార్టీతో దగ్గరి సంబంధాలున్న వైఎస్ఆర్‌సీపీ వైపు అనుమానంగా చూడాల్సి వస్తోంది. ఈ కారణంగానే జగన్ మరో ఎజెండా ఉండదని చెప్పినట్లుగా తెలుస్తోంది. 

Published at : 12 Nov 2022 03:21 PM (IST) Tags: YSRCP AP government Prime Minister Modi CM Jagan Jagan's association with Modi

సంబంధిత కథనాలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

Machilipatnam YSRCP : బందరు పోర్టుకు శంకుస్థాపనపై వైఎస్ఆర్‌సీపీలో రచ్చ - చెరో తేదీ చెబుతున్న ఎమ్మెల్యే నాని , ఎంపీ శౌరి !

Machilipatnam YSRCP : బందరు పోర్టుకు శంకుస్థాపనపై వైఎస్ఆర్‌సీపీలో రచ్చ -  చెరో తేదీ చెబుతున్న ఎమ్మెల్యే నాని , ఎంపీ శౌరి 	!

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

టాప్ స్టోరీస్

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్