By: ABP Desam | Updated at : 27 Apr 2022 06:18 PM (IST)
మే 10 నుంచి ఇంటింటికి వైఎస్ఆర్‌సీపీ - 151 సీట్లు తగ్గకూడదన్న సీఎం జగన్!
మే 10వ తేదీ నుంచి ఇంటింటికి వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రెండేళ్లలో ఎన్నికలు రానున్నందున ఇప్పటి నుండే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఏం చేయాలో రోడ్ మ్యాప్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పథకాలు తీసుకున్న వారి జాబితాను ఆయా జిల్లాల అధ్యక్షులకు అందుతాయని.. ఎవరికైనా పథకాలు అందకపోతే వారికి అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జూలై 8వ తేదీన పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని జగన్ పార్టీ నేతలకు తెలిపారు.
ఎన్నికలకు ముందు ఓ ఆలోచనా విధానంతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం జగన్ కార్యాచరణను దిశానిర్దేశం చేశారన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి చెబుతామన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం పాజిటివ్‌గా ఉందన్నారు. పార్టీ పరంగా సర్వేలు చేయిస్తున్నామని.. సర్వేల్లో వెనుకబడిన వారికి.. జనాదరణ కోల్పోయిన వారికి టిక్కెట్లు దక్కబోవని మాజీ మంత్రి కొడాలి నాని సమావేశం తర్వాత ప్రకటించారు. 65 శాతం ఎమ్మల్యేల గ్రాఫ్ బాగుందని సీఎం జగన్ తతెలిపారు. పలువురు ఎమ్మెల్యేల గ్రాఫ్‌లలో హెచ్చతగ్గులు ఉన్నాయని.. గ్రాఫ్ పెంచుకోవాలని జగన్ సూచించారని కొడాలి తెలిపారు. ఓడిపోయే వారికి ఏ రాజకీయ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వబోదన్నారు.
చంద్రబాబు కుయుక్తులను పార్టీ పరంగా ఎదుర్కోవాలని.. పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని సీఎం జగన్ సూచించారని కొడాలి నాని తెలిపారు. గ్రామ , వార్జు సచివాలయాల్లో ఓ పుస్తకం అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే.. ప్రజలు ఆ పుస్తకంలో రాసే అవకాశం కల్పిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సీరియస్‌గా ఉండాలని జగన్ స్పష్టం చేశఆరు. నెలకు కనీసం పది గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలన్నారు. సర్వేల్లో పార్టీకి మైనస్‌గా మారిన పలు అంశాలపై ఎలా స్పందించాలో జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.
ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం వచ్చే ఎన్నికల్లోనూ 151 సీట్లు సాధించడమేనని జగన్ స్పష్టం చేశారు. 175కి 175 సీట్లు ఎందుకు రాకూడదని ఎమ్మెల్యేల్ని జగన్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. భారీ మెజార్టీతో ప్రజలు మనకు అధికారం కట్టబెట్టారని అదే స్థాయిలో మళ్లీ సీట్లు సాధించాల్సిందేనని జగన్ స్పషఅటం చేశారు. మంత్రులుగా ఉన్న వాళ్లు ఒక అడుగు వెనక్కి వేసి అందర్నీ కలుపుకుని వెళ్లాలన్నారు. గెలిచేందుకు వనరులు సమకూర్చుతానని హామీ ఇచ్చారు.
Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం
అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్ తీర్పుపై తీవ్ర విమర్శలు
Rahul Gandhi: భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్ గాంధీ
వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా
Vasundhara Raje: బీజేపీ పరివర్తన యాత్రకు వసుంధర రాజే డుమ్మా ! అధిష్టానం తీరుపై అలక
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు
Canada Singer Shubh: భారత్ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్ శుభ్
Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా
/body>