News
News
X

Ganta In YSRCP : వైఎస్ఆర్‌సీపీలో చేరే యోచనలో గంటా - డిసెంబర్ 1న నిర్ణయం ప్రకటించే అవకాశం !

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. డిసెంబర్ 1న ఆయన పుట్టిన రోజు నాడు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

FOLLOW US: 
Share:

Ganta likely to Join YSRCP - విజయవాడ:  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ వైఎస్ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.  గంటా శ్రీనివాసరావు సన్నిహితులు ఇప్పటికే ఆ మేరకు లీకులు ఇస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో వైజాగ్ పర్యటన కు వస్తున్న సీయం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరుతారని చెబుతున్నారు.  డిసెంబర్ 1 న గంటా ఫుట్టిన రోజు సందర్భంగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే చాన్స్ ఉందని అంటున్నారు.  2019 లో  టీడీపీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ను నిరసిస్తూ ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు అందించగా అది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది.  

గత మూడున్నరేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా 

ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. టీడీపీ పార్టీ ఓడిపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.  పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ కు వచ్చిన సందర్భాల్లోనూ గంటా పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు. అదే సమయంలో గంటా ను పార్టీలోనే అట్టి పెట్టుకునే ప్రయత్నాలు చేసింది తెలుగుదేశం అధిష్టానం. స్వయంగా అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో  గంటా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి మరీ ఆయన కుటుంబ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత కూడా గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనలేదు.కేవలం అయ్యన్న పాత్రుడు అరెస్ట్ విషయంలో మాత్రమే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు. అయితే.. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు ఆయన క్యాంప్ సంకేతాలు ఇస్తోంది.

బీజేపీ, జనసేనల్లోకి వెళ్తారని మొదట్లో ప్రచారం - ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వైపు చూపు 
 
మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ కు అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీలో కీలక నేత గా వ్యవహరించారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక మంత్రి పదవి సైతం పొందారు.రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి అక్కడా మంత్రి పదవిని పొందారు.2019 ఎన్నికల్లో జగన్ హవా లో సైతం ఎమ్మెల్యే గా గెలిచిన గంటా శ్రీనివాసరావు ఆ తర్వాత టీడీపీ లో యాక్టివ్ గా ఉండడం తగ్గించారు. మధ్యలో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన లో చేరుతారనే గట్టి ప్రచారమే జరిగింది. అయినప్పటికీ అటు గంటా..ఇటు పవన్ ఇద్దరూ ఆ విషయంలో మౌనంగానే ఉంటూ వచ్చారు. ఇక 2024 ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు చూపు వైఎస్ఆర్‌సిపీ వైపు మళ్లింది అంటున్నారు అయాన సన్నిహితులు.

గతంలో చేరిక ప్రయత్నాలను ఇతర వైఎస్ఆర్‌సీపీ నేతలు అడ్డుకున్నారని ప్రచారం 

 నిజానికి గంటా శ్రీనివాసరావు ఏడాది ముందే వైఎస్ఆర్‌సిపీ వైపు వెళ్లే ప్రయత్నం చేశారని అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు అనే ప్రచారం ఉంది. అప్పట్లో మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు, ఇంచార్జి గా ఉన్న విజయ సాయి రెడ్డి లు గంటా చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు .  అయినప్పటికీ కొన్ని సార్లు ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది.  
అయితే ప్రస్తుతం మారిన పరిణామాల దృష్ట్యా గంటాకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. 

Published at : 26 Nov 2022 02:52 PM (IST) Tags: Ganta Srinivasa Rao Ganta joined YSRCP and TDP MLA Ganta Srinivas

సంబంధిత కథనాలు

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

TS Budget Tensions : కేంద్రం నుంచి వచ్చేది అరకొరే - బడ్జెట్ కత్తి మీద సామే ! హరీష్ రావు లెక్కల మాయాజాలం ఎలా ఉంటుంది ?

TS Budget Tensions : కేంద్రం నుంచి వచ్చేది అరకొరే - బడ్జెట్ కత్తి మీద సామే ! హరీష్ రావు లెక్కల మాయాజాలం ఎలా ఉంటుంది ?

రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!

రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!

టాప్ స్టోరీస్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,  ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!