Palasa TDP: టీడీపీకి మేలు చేసిన మంత్రి గారి ఛాలెంజ్ - పలాసలో ఏకమైన ప్రతిపక్ష నేతలు !
పలాస నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న టీడీపీ క్యాడర్.. ఇటీవలి ఉద్రిక్తతలతో ఒక్క సారిగా యాక్టివ్ అయ్యారు.
Palasa TDP: మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పలాస నియోజకవర్గంలో ఇటీవల నారా లోకేష్ పర్యటించాలనుకున్నారు. కానీ పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. అంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటానికి కారణం మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన చాలెంజే. టీడీపీ కౌన్సిల్ ఇంటిని అక్రమంగా కూలగొట్టారంటూ.. ఆ పార్టీ నేతలు ప్రారంభించిన ఉద్యమం.. అనేక ఉద్రిక్తలకు కారణమైనా చివరకు టీడీపీ నేతలంతా ఏకమయ్యేలా చేసింది.
పలాసలో ఏకమైన టీడీపీ నేతలు !
పలాస టీడీపీ నేతలంతా ఐక్యతా రాగం ఆలపిస్తున్నారు. సవాళ్ల కు.. ప్రతి సవాళ్లు విసిరారు. వెన్ను చూపేది లేదని స్పష్టం చేశారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి మరీ రోడ్డెక్కారు.. ఎవరేం చేస్తారో.. చూద్దాం అంటూ.. కదనరంగంలో దికారు. తమ నాయకు రాలు గౌతు శిరీషకు అంతా.. అండగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆమె గెలుపే.. తమ గెలుపన్న సంకేతాలిచ్చారు. ఎంతటి వారైనా..గీత దాటితే..లెక్క చేయమని తేల్చి చెప్పారు. వారికి పార్టీ అండగా నిలిచింది. సాక్షాత్తూ.. రాష్ట్ర అధ్యక్షుడు రంగంలోకి దిగారు. మరో వైపు ఎంపీ రామ్మోహన్ తెగువ.. వారిలో ధైర్యం నింపింది. గౌతు శివాజీ ఎంట్రీ.. కొండంత ధైర్యాన్నిచ్చింది.
గౌతు శిరీషను ప్రోత్సహిస్తున్న టీడీపీ హైకమాండ్ !
పలాసలో చెల్లాచెదురైనా క్యాడర్ ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చింది. దేనికైనా రెడీ అన్న..సంకేతాలిచ్చింది. అక్కడి పార్టీ ఇన్చార్జి గౌతు శిరీష..వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు. అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. మరో వైపు ఆ పార్టీ అధిష్ఠానం కూడా ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అండగా నిలుస్తోంది. అవసరమైతే.. రాష్ట్ర పార్టీ తరలివచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో..శిరీష సైతం జోరు పెంచారు. పార్టీ కార్యక్రమాలతో పాటు.. క్యాడర్ను వ్యక్తిగతంగా కలుస్తూ.. ముందుకు దూసుకుపోతున్నారు. మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి..క్యాడర్ను మరింత బలోపేతం చేస్తున్నారు. పార్టీ కొత్త జోష్ ముందుకు సాగుతోంది . పార్టీ కార్యక్రమాలు గ్రామాల్లో సైతం యాక్టివ్ అయ్యారు. వైఎస్ఆర్‌సీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని.. తాము ఎదుర్కొంటామని అంటున్నారు.
శిరీష రాజకీయాల్ని సరిదిద్దుతున్న శివాజీ !
రాజకీయాల్లో మచ్చ లేని నాయకుడు శివాజీ. ఎవరి వద్దా.. ఏమీ ఆశించరని, సెటిల్మెంట్లు, దందాలకు అంగీకరించరని అందరికీ తెలుసు. మరో వైపు నర్మగర్భంగా మాట్లాడతారని చెబుతారు. అందుకే..ఆయనంటే..పార్టీలకు అతీతంగాగౌరవిస్తారు. సర్దార్ గౌతు లచ్చన్న వారుసుడిగా.. ఆ విలువలను ఆయన కాపాడుకుంటూ వచ్చారు. అప్పలరాజుపై శిరీష వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. అలా.. మాట్లాడకూడదంటూ.. ఖండించారు.'అణిచివేత నుంచే.. విప్లవం పుడుతుంది' అన్నారో.. విప్లవ కవి. ఇదే జరిగింది పలాసలో అని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవలి ఉద్రిక్తతల తర్వాత పలాసలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. రెండు నెలల క్రితం వరకు వార్ వన్ సైడ్ అన్న భ్రమ ఉండేది. అది ఇప్పుడు మారిపోయింది. ఇటీ టీడీపీ లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.
ఎవరు ఎవరికి బాకీ ? ఏపీ, తెలంగాణ విద్యుత్ బకాయిల వివాదం పూర్తి డీటైల్స్ ఇవిగో !