Chandrababu Naidu arrest: ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ విజయవంతం, రాజమహేంద్రవరం చేరుకున్న ఉద్యోగులు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి ర్యాలీగా బయలుదేరిన ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరం చేరుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి ర్యాలీగా బయలుదేరిన ఐటి ఉద్యోగులు విజయవంతంగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. 'కారులో సంఘీభావ యాత్ర' పేరుతో ఇవాళ ఉదయం హైదరాబాదు నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు కార్లలో బయలుదేరారు. చంద్రబాబు వాళ్ళే తాము ఈ స్థాయిలో ఉన్నామని, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం చేరుకున్న కొందరు ఐటి ఉద్యోగులు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ సతీమణి భువనేశ్వరుని కలిసి సంఘీభావం తెలిపారు.
అన్ని అడ్డంకులను దాటుతూ....
హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో కార్లలో బయలుదేరిన ఐటీ ఉద్యోగులు అన్ని అడ్డంకులను దాటితో చివరిగా గమ్యస్థానానికి చేరుకున్నారు. పోలీసులు ఎన్ని అంశాలు విధించినప్పటికీ వాటన్నింటినీ దాటుకొని రాజమహేంద్రవరం చేరుకున్నారు. కొంతమంది మార్గమధ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత ప్రాంతానికి రావడానికి అంశాలు విధించడంపై ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని ఏపీ పోలీసులు శనివారం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ర్యాలీలకు, నిరసనలకు అనుమతులు లేవని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా ఒక ప్రకటనలో వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గరికపాడు సహ వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అన్ని అంశాలను దాటుకుంటూ చివరకు ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరానికి చేరుకున్నారు.
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన..
ఏపీ పోలీసులు రాష్ట్ర సరిహద్దుల వద్ద అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు తలపెట్టిన కార్ల యాత్రను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్ల ర్యాలీకి ఆనుమతి లేదని.. ఎలాంటి నిరసన ర్యాలీలకు సైతం అనుమతులు లేవని అంటున్నారు.
తెల్లవారుజామున రెండు గంటల నుండి జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకిరామ్ ఆధ్వర్యంలో అనుమంచిపల్లి కోల్డ్ స్టోరేజ్ వద్ద, బోర్డర్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీ చేపట్టారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని ముఖ్యంగా కార్లను పోలీసులు ఆపేస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దులు ప్రాంతాలపై పోలీసులు నిగా పెట్టారు. ర్యాలీ పూర్తయినా కానీ పోలీసులు ముందస్తు జాగ్రత్తగా వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను అనుమంచిపల్లి వద్ద నిలుపుదల చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను విజయవాడ వైపు రాకుండా చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. సరైన పత్రాలు ఉంటేనే కార్లను అనుమతి ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడానికి టీడీపీ ప్రొఫెషనల్ రింగ్ విభాగం అధ్యక్షులు తేజస్విని తీవ్రంగా తప్పుపట్టారు. భారతదేశంలో స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లగలుగుతామని... కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం రాలేకపోతున్నామని మండపడ్డారు. ఆంధ్రప్రదేశ్ భారత్లో భాగం కాదన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మద్దతుగా కార్ల ర్యాలీ నిర్వహించిన ఐటీ ఉద్యోగులకు తేజస్విని కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుపై ఐటీ ఉద్యోగుల ప్రేమ ఎనలేనిదని కొనియాడారు.