అన్వేషించండి

Chandrababu Affidavit: కాసు బంగారం కూడా లేని చంద్రబాబు - లోకేష్‌, భువనేశ్వరి వద్ద అప్పులు- టీడీపీ అధినేత ఆస్తులు, కేసుల చిట్టా ఇదే

Chandrababu Assets In 2024 : ఐదేళ్లలోనే అనూహ్యంగా చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ 40 శాతం పెరిగి రూ.931 కోట్లకు చేరుకుంది. అదే విధంగా ఆయనపై గతంలో రెండు కేసులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 22కు చేరింది.

Chandrababu Assets And Cases: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబం ఆస్తి విలువ ఈ ఐదేళ్లలో దాదాపు 40శాతం పెరిగింది. ఇది కేవలం ఆయన, భార్య భువనేశ్వరి పేరిట ఉన్న ఆస్తులు మాత్రమే. గత ఎన్నికల సమయంలో 545 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా...ఇప్పుడు ఆ విలువ 931 కోట్లకు పెరిగింది. అలాగే ఆయనపై ఈ ఐదేళ్లలో ఏకంగా 22 కేసులు నమోదు అయ్యాయి. గతంలో చంద్రబాబుపై కేవలం రెండే కేసులు ఉండేవి.

చంద్రబాబు నామినేషన్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి తొలిసారి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. తొలుత సర్వమత ప్రార్థనలు నిర్వహించిన ఆమె...భారీ ర్యాలీగా తరలివెళ్లి చంద్రబాబు తరఫున నామపత్రాలు అందజేశారు. 2014 ఎన్నికల సమయంలో కుమారుడు లోకేశ్ నామినేషన్ దాఖలు చేయగా...గత ఎన్నికల్లో స్థానిక నేతలే ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఆస్తులు
ఈ ఐదేళ్లలో చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. గత ఎన్నికల సమయంలో ఆయన అఫిడవిట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన, భార్య భువనేశ్వరి ఆస్తులు 545 కోట్లు కాగా....ఇప్పుడు ఏకంగా 40శాతం పెరిగి 931 కోట్లుకు చేరుకుంది. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం చంద్రబాబు పేరిట మొత్తం రూ.36.36 కోట్లు ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు రూ.4.80 లక్షలు కాగా రూ. 2,22,500 విలువైన అంబాసిడర్ కారు ఉంది. చంద్రబాబు  వద్ద ఎలాంటి బంగారం లేదు. అలాగే రూ.36.31 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 

చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరిట ఏకంగా రూ.895 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌లోని 2.26 కోట్ల షేర్లు ఉండగా...వీటి విలువ రూ.763.93 కోట్లు. బంగారం, ఇతర ఆభరణాలు విలువ దాదాపు కోటిన్నర  ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్‌లోని రూ.85.10 కోట్ల  విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మొత్తంమీద చంద్రబాబు కన్నా ఆయన భార్య భువనేశ్వరి పేరిటే ఎక్కువ ఆస్తులు ఉండటం విశేషం. హెరిటేజ్ సంస్థలో షేర్లు విలువ మినహా మిగిలిన ఆస్తులన్నీ మార్కెట్‌ విలువ ప్రకారమే లెక్కించి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. భువనేశ్వరి పేరిట ఎలాంటి కారు లేకపోవడం విశేషం

అప్పులు
చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తో కలిసి  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు. ఇది ఒక్కటే చంద్రబాబుకు ఉన్న అప్పు. అటు భువనేశ్వరికి రూ.6.83 కోట్లు అప్పుడు ఉండగా... కుమారుడు లోకేశ్‌ నుంచే రూ.1.27 కోట్లు అప్పు తీసుకోవడం విశేషం.
Chandrababu Affidavit: కాసు బంగారం కూడా లేని చంద్రబాబు - లోకేష్‌, భువనేశ్వరి వద్ద అప్పులు- టీడీపీ అధినేత ఆస్తులు, కేసుల చిట్టా ఇదే

కేసులు
2019కు ముందు చంద్రబాబుపై కేవలం రెండే కేసులు ఉండగా...ఈ ఐదేళ్లలో ఏకంగా 22 కేసులు వచ్చి పడ్డాయి. వాటిలో మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో పెట్టిన కేసులే ఏకంగా 8 ఉన్నాయి. చంద్రబాబుపై అన్నమయ్య, తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రెండేసి చొప్పున, అనంతపురం, గుంటూరు, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖ, నంద్యాల జిల్లాలతోపాటు మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులున్నాయి. భువనేశ్వరిపై ఆదాయపన్ను శాఖ నుంచి రూ.6,04,900 డిమాండ్‌ నోటీసుపై వివాదం ఒక్కటే ఉంది..

టాప్ హెడ్ లైన్స్

TPCC Showcause Notice: టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
YS Jagan Local Body Elections Strategy 2026: గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget