అన్వేషించండి

Narsapuram Janasena MLA: జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు క్లాస్ - కూటమిలో మైక్రో మేనేజ్‌మెంట్ - ప్రమాద ఘంటికలా?

TDP vs Janasena: నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌పై సీఎం చంద్రబాబు నేరుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూటమిలో సమస్యలు సృష్టిస్తుందా?

Chandrababu Comments on Janasena MLA: నరసాపురం నియోజకవర్గంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరుపై బహిరంగంగానే  అసంతృప్తి వ్యక్తం చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. నియోజకవర్గానికి చెందిన 25 కేపీఐ  సూచీల్లో 23 మైనస్ ఉన్నాయని సభాముఖంగా స్పష్టం చేస్తూ, నోడల్ అధికారిని మార్చాలని కలెక్టర్‌ను ఆదేశించడం, అధికారులకు గట్టిగా క్లాస్ తీసుకోవడం కలకలం రేపింది. పాలనా సంస్కరణలు, పనితీరు ఆధారిత నాయకత్వంపై చంద్రబాబుకు ఉన్న పట్టుకు ఇది నిదర్శనమే అయినా, మిత్రపక్ష ఎమ్మెల్యేను ప్రజల ముందే అలా నిలదీయడం కూటమి ధర్మానికి విఘాతం కలిగిస్తుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ ఎమ్మెల్యేలను మందలించడం వేరు.. జనసేన ఎమ్మెల్యేలను మందలించడం వేరు!

తెలుగుదేశం పార్టీ అధినేతగా సొంత పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను చంద్రబాబు వేదికలపై లేదా సమీక్షా సమావేశాల్లో హెచ్చరించడం దశాబ్దాలుగా వస్తున్న శైలి. టీడీపీ ప్రజాప్రతినిధులు ఆ వ్యాఖ్యలను పార్టీ పెద్ద ఇచ్చే హెచ్చరికగా పరిగణిస్తారు. కానీ, కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీ ప్రజాప్రతినిధి విషయంలో అదే వ్యూహాన్ని వర్తింపజేయడం పొలిటికల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనని భావిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు నేరుగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తుండటంతో, వారి పనితీరుపై చర్యలు లేదా హెచ్చరికలు ఉంటే అంతర్గత సమన్వయ కమిటీల ద్వారా లేదా పవన్ కళ్యాణ్‌ ద్వారా ఇప్పించడమే సరైన పద్ధతిగా చెబుతున్నారు. 

జనసైనికుల్లో అసంతృప్తి 

ఈ బహిరంగ వ్యాఖ్యల పట్ల జనసేన కేడర్,  జనసైనికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యేకు పనితీరు సరిగా లేకపోతే సరిదిద్దే బాధ్యత తమ అధినేత పవన్ కళ్యాణ్‌ది అని, మైకుల ముందుకు వచ్చి ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఇమేజ్‌ను ప్రజల ముందు తగ్గించడం వల్ల రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్‌లో కేడర్ మధ్య వైషమ్యాలు పెరుగుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. మిత్రపక్ష నాయకుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పబ్లిక్ వేదికలపై మాట్లాడటం వల్ల క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య ఉండాల్సిన ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. 

రేపు టీడీపీ ఎమ్మెల్యేలపై పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే? 

 ఇది రాబోయే రోజుల్లో మరింత పెద్ద రాజకీయ వివాదానికి ఆజ్యం పోసే అవకాశముంది. రేపు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, పాలనాపరమైన లోపాలున్న ఏదేని టీడీపీ ఎమ్మెల్యేను లేదా టీడీపీ మంత్రుల నియోజకవర్గాలను ఉద్దేశించి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే ప్రశ్న వస్తోంది.  పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ ప్రజాప్రతినిధులపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తే, అది పొత్తు ధర్మానికి ముగింపు పలికి రెండు పార్టీల మధ్య పరస్పర దాడులకు  దారితీస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డేటా-డ్రివెన్ గవర్నెన్స్‌కు, రిపోర్ట్ కార్డులకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. పాలనలో సీనియారిటీ, పొత్తులు చూడకుండా పనితీరునే ప్రామాణికంగా తీసుకుంటారనే సందేశాన్ని ప్రజల్లోకి పంపాలనేది ఆయన ఆలోచన కావచ్చు. 

రాష్ట్రాభివృద్ధికి కూటమి స్థిరత్వం ఎంత ముఖ్యమో గ్రహించిన క్రమంలో, వ్యూహాత్మకంగా మైక్రో మేనేజ్‌మెంట్ వ్యాఖ్యలను అంతర్గత సమావేశాలకే పరిమితం చేయకపోవడం చంద్రబాబు చేసిన ఒక చిన్న రాజకీయ అంచనా పొరపాటేనని నిపుణులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించాలంటే రిపోర్ట్ కార్డులను అమలు చేయడం ఎంత ముఖ్యమో, మిత్రపక్షాల ఆత్మగౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమన్న భావన వ్యక్తమవుతోంది.    


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renuka Chowdhury at ABP Summit: దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
KTR Speech ABP Southern Rising Summit 2026 : రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
Embed widget