పవన్ కల్యాణ్ ఆలోచనలు ఎప్పుడూ యువత గురించి, వారి భవిష్యత్తు గురించే ఉంటాయి. యువత ఆశయాలు, ఆకాంక్షల నుంచే జనసేన పార్టీ పుట్టింది.
Janasena Jai Kottu: జనసేన యూత్ వింగ్ 'జై కొట్టు' ఆవిష్కరణ.. యుద్ధం చేసే పిడికిళ్లు కావాలి.. పవన్ ఆడియో సందేశం
Janasena Jai Kottu: జనసేనకు యువతే బలం అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పిఠాపురంలో జనసేన యూత్ వింగ్ 'జై కొట్టు'ను ఆయన ఆవిష్కరించారు.

- నియంతలాంటి జగన్ పాలనకు యువత అడ్డుగా నిలిచారని వెల్లడించారు.
Janasena Jai Kottu: జనసేన పార్టీకి యువతే బలం, పార్టీ ప్రయాణంలో యువత పాత్రే కీలకమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ను పిఠాపురంలో ఆయన ఆవిష్కరించారు. "‘‘ జై కొట్టు.. దేహీ అని దేబురించే చేతులు మాకొద్దు. దేశం కోసం యుద్ధం చేసే పిడికిళ్లు కావాలి" అని పవన్ కల్యాణ్ ఫోన్ ద్వారా అందించిన సందేశాన్ని జనసైనికులకు వినిపించారు. అనంతరం జై కొట్టు ప్రత్యేక లోగోను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆలోచనలు ఎప్పుడూ యువత గురించి, వారి భవిష్యత్తు గురించే ఉంటాయి. యువత ఆశయాలు, ఆకాంక్షల నుంచే జనసేన పార్టీ పుట్టింది. ప్రతి ఉద్యమం, పోరాటంలో, ప్రతి పిలుపులో, గెలుపులో జనసేనకు యువత తోడుగా ఉన్నారు. పవన్ కల్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో, ఆయన భావజాలాన్ని అర్ధం చేసుకోవడంలో యువతరం ముందుంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ప్రతిసారీ మీకు నాకు ఒక గుండె మాత్రమే దూరం అని చెబుతుంటారు" అన్నారు.
జనసేన కోసం నిస్వార్థంగా నిలబడింది యువతరమే అని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజకీయాల్లో అనుభవంతోపాటు చిత్తశుద్ధి, నమ్మకం అనేది చాలా అవసరమన్నారు. యువత రాజకీయాల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఓ అద్భుతమైన దేశాన్ని తీర్చిదిద్దాలంటే యువత వల్లనే సాధ్యమన్నారు. మంచి పని చేయాలనే ఆలోచన, సమాజానికి ఏదైనా చేయాలనే తపన మనలో ఉంటే దాన్ని అణచి వేయొద్దన్నారు.
Also read: ఉత్తరాంధ్ర జలస్వప్నం సాకారం - ‘సిగ్నేచర్’ అక్విడెక్టుతో మారుతున్న రీజినల్ పొలిటికల్ డిజైన్!
25 ఏళ్ల భవిష్యత్తు
యువత ఆలోచనలను పవన్ కల్యాణ్ లోతుగా అర్థం చేసుకుంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 2018లో తిత్లీ తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన సందర్భంగా 10 రోజులపాటు ఆ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ తో తాను పర్యటించానన్నారు. ప్రతిరోజూ ఓ గ్రామం, ప్రాంతాలు తిరిగి అక్కడున్న స్థానిక యువతతో రోడ్ల పక్కనే మాట్లాడిన రోజులున్నాయన్నారు. అదే సమయంలో శ్రీకాకుళం వరద బాధితుడైన యువకుడు ‘మాకు 25 కేజీల బియ్యం కాదు... 25 ఏళ్ల భవిష్యత్తు ’ కావాలి అని పవన్ కల్యాణ్ తో చెప్పిన మాటనే ఆయన పార్టీ నినాదంగా తీసుకున్నారని గుర్తుచేశారు. నల్లమల యూరినేయం తవ్వకాలపై ఓ యువకుడు పార్టీ కార్యాలయం ముందు ఉంటే సమస్యను మొత్తం విని, అధికారంలో లేకపోయినా అఖిలపక్షం ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించేలా ప్రయత్నించారన్నారు.
Also Read: ఎంతో మంది హృదయాల్లో ఉన్నావ్... భర్త పవన్ బర్త్ డేకి అన్నా కొణిదెల బ్యూటిఫుల్ పోస్ట్
నియంతలాంటి జగన్
"2019 తర్వాత జనసేన పార్టీ మీద అప్పటి వైసీపీ నాయకుడు చేసిన దాడి, సాగించిన దమనకాండను యువతే అడ్డుగా నిలబడింది. జనసేన పార్టీ రాష్ట్రానికి, దేశానికి ఎంత అవసరమో గుర్తించి యువతరం పార్టీని బతికించుకునేందుకు పోరాడింది. నియంతలాంటి వ్యక్తి, తాను చెప్పింది జరగాలి అనుకునే జగన్ లాంటి పాలకుడికి అడ్డుగా నిలబడి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొన్నాం. 2026 నాటికి జనసేన క్రియాశీలక విభాగం సభ్యులు 21.52 లక్షలకు చేరారు. వీరిలో యువతే అధికం. జనసేనకు యువతే ఇంధనం" అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
Also Read: పవర్ స్టార్ బర్త్ డే వేడుకల్లో విషాదం - విద్యుత్ షాక్‌తో అభిమాని మృతి
Frequently Asked Questions
పవన్ కల్యాణ్ యువత గురించి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















