అన్వేషించండి

Modi Shah BJP Party Overhaul: బీజేపీలో భారీ సంస్థాగత మార్పులు - జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అవుట్?.. మోదీ-షా జనరేషన్ షిఫ్ట్ ప్లాన్ ?

BJP RSS Coordination Issues: కేంద్ర మంత్రివర్గంలోనే కాదు.. బీజేపీలోనూ పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలని మోదీ , షాలు భావిస్తున్నారు. ముఖ్యంగా బీఎల్ సంతోష్‌ను తిరిగి ఆరెస్సెస్‌కు పంపాలనుకుంటున్నారు.

Next Generation Leaders in BJP National Team:  భారతీయ జనతా పార్టీ  లో ఊహించని రీతిలో సమూల ప్రక్షాళనకు తెరలేచింది. కేవలం కేంద్ర మంత్రివర్గంలోనే కాదు.. అటు పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ పెను మార్పులు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ద్వయం గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షాల తర్వాత ఢిల్లీ బీజేపీలో అత్యంత శక్తివంతమైన చక్రం తిప్పుతున్న జాతీయ  సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను ప్రస్తుత బాధ్యతల నుంచి పక్కన పెట్టే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు  ప్రచారం జరుగుతోంది.  సుదీర్ఘ కాలంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను, టికెట్ల కేటాయింపులను, ఎన్నికల వ్యూహాలను శాసిస్తున్న ఆయనను తిరిగి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  మాతృ సంస్థకు పంపేందుకు తెరవెనుక ముమ్మర కసరత్తు జరుగుతోందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
 
 నెక్స్ట్ జనరేషన్ లీడర్‌షిప్ 

బీఎల్ సంతోష్ ను మార్చడం  కేవలం ఒక వ్యక్తిని మార్చడం కాదు, ఇది రాబోయే 15-20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీ వేస్తున్న ఒక చారిత్రాత్మక అడుగు. ప్రస్తుతం 70 ఏళ్ల వయస్సుకు చేరువవుతున్న సీనియర్ నేతల స్థానంలో, సాంకేతికతపై పట్టు ఉండి, మారుతున్న యువ భారతదేశ ఓటర్ల నాడిని పట్టుకోగల నెక్స్ట్ జనరేషన్   లీడర్లను కీలక స్థానాల్లో కూర్చోబెట్టాలని మోదీ-షా భావిస్తున్నారు. పార్టీని తదుపరి తరానికి సజావుగా పాస్ చేసే ప్రక్రియలో భాగంగానే ఈ సంస్థాగత శస్త్రచికిత్సకు శ్రీకారం చుట్టారని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. 

 కర్ణాటక దెబ్బ.. వ్యూహాల బెడిసిపాటు! 

ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కోటా నుండి వచ్చి బీజేపీ జాతీయ సంఘటనా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బీఎల్ సంతోష్.. పార్టీలో అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యడియూరప్ప లాంటి మాస్ లీడర్లను కాదని ఆయన అనుసరించిన కొన్ని క్షేత్రస్థాయి వ్యూహాలు పార్టీని ఘోరంగా దెబ్బతీశాయనే అసంతృప్తి అధిష్ఠానంలో బలంగా నాటుకుపోయింది. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ గేట్‌వే అయిన కర్ణాటకను చేజార్చుకోవడం, అలాగే కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో టికెట్ల పంపిణీలో లోపాలు ఉండటం వల్లే పార్టీ ఆశించిన మెజారిటీని సొంతంగా సాధించలేకపోయిందనే ఇంటెలిజెన్స్ నివేదికలు మోదీ-షాలకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్‌లో సరికొత్త రక్తాన్ని ఎక్కించక తప్పదని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయ్యారు. 

 సంఘటనా కార్యదర్శి పదవి ఎంత కీలకం? 

బీజేపీ లేదా సంఘ్ పరివార్ వ్యూహాల్లో జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి పదవి అత్యంత శక్తివంతమైనది. ఈ స్థానంలో ఉన్న వ్యక్తి నేరుగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి,  బీజేపీ అధినాయకత్వానికి మధ్య ఒక బలమైన వంతెనలా పనిచేస్తారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి కంటే కూడా అంతర్గత నియామకాలు, క్రమశిక్షణ చర్యలు,  రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల నివేదికలపై ఈ పదవిలో ఉన్న వ్యక్తికే ఎక్కువ పట్టు ఉంటుంది. గతంలో కుశభావ్‌ ఠాక్రే, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా, ఆ తర్వాత సంజయ్ జోషి, రామ్ లాల్ వంటి దిగ్గజాలు పనిచేసిన ఈ స్థానంలో మార్పు జరుగుతోందంటే.. పార్టీ సిద్ధాంత పరంగా, శైలి పరంగా చాలా పెద్ద మలుపు తిరగబోతోందని అర్థం. 

 ఆర్ఎస్ఎస్ - బీజేపీ మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించే వ్యూహం! 

ఇటీవలి కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తదితర ప్రముఖులు చేసిన కొన్ని వ్యాఖ్యలు, బీజేపీ అంతర్గత  అంశాలపై విమర్శలు చేశారు. క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ,  బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. బీఎల్ సంతోష్ హయాంలో సంఘ్‌కు, పార్టీకి మధ్య ఒక విధమైన కోల్డ్ వార్ నడిచిందనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు సంతోష్‌ను తిరిగి ఆర్‌ఎస్‌ఎస్‌కు పంపి, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యుడైన సరికొత్త, సౌమ్యుడైన వ్యూహకర్తను ఆ స్థానంలో పెట్టడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను మళ్లీ ఎన్నికల పోరాటాల్లో యాక్టివ్ చేయాలని మోదీ భావిస్తున్నారు. 

 మోదీ 3.0 లో ఊహించని మార్పులు

మొత్తానికి మోదీ 3.0 ప్రభుత్వ హయాంలో అటు కేబినెట్, ఇటు పార్టీ ఐడెంటిటీని పూర్తిగా మార్చేసే లాంగ్ టర్మ్ ప్లాన్ అమలవుతోంది  కీలకమైన ప్రధాన కార్యదర్శుల మార్పుల ద్వారా సరికొత్త టీమ్ మోదీ   రూపుదిద్దుకోనుంది. పాత సంకెళ్లను తెంచుకుని, కేవలం పనితీరు,  గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తూ బీజేపీ చేయబోతున్న ఈ మహా ప్రక్షాళన.. మిగిలిన రాజకీయ పార్టీలకు కూడా ఒక పెద్ద సంకేతాన్ని పంపుతోంది.  

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion: కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
Telangana Congress Vote Chori Meeting: తెలంగాణలో కాంగ్రెస్ ఓటు చోరీ సభ - సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసమా?
తెలంగాణలో కాంగ్రెస్ ఓటు చోరీ సభ - సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసమా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget