అన్వేషించండి

BJP Silent Operation North Telangana: ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!

BJP Micro Politics: ఉత్తర తెలంగాణలో బీజేపీ మైక్రో-పాలిటిక్స్ చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్లాటల వేళ.. సైలెంట్‌గా పల్లెలను లాక్ చేస్తోంది.

Social Engineering by BJP:  తెలంగాణ రాజకీయ క్షేత్రంపైకి చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ధర్నాలు, అరెస్టులు, సవాళ్లతో రోజూ రసవత్తరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, స్క్రీన్ వెనుక అసలు కథ వేరేలా నడుస్తోంది.  హెడ్‌లైన్స్‌కు  దూరంగా, ఎలాంటి పొలిటికల్ హడావుడి లేకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ  ఒక నిశ్శబ్ద విప్లవానికి తెరలేపింది. గతంలో తాము జెండా పాతిన దుబ్బాక, హుజూరాబాద్‌లతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో కాషాయ దళం ప్రయోగించిన  హైపర్ లోకల్ గ్రౌండ్ స్ట్రాటజీ  ఇప్పుడు రాష్ట్ర రాజకీయ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

పోరాటాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్న వ్యూహం 

ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు, స్థానిక కమిటీల నియామకాలు, పాత సివిల్ వివాదాల చుట్టూ కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ రెండు పార్టీల గ్రూపు తగాదాలతో విసిగిపోయిన తటస్థ ఓటర్లను, ఏ వర్గంలోనూ చేరలేక ఇబ్బంది పడుతున్న సగటు గ్రామీణ యువతను బీజేపీ తన వైపు తిప్పుకుంటోంది.  స్థానికంగా ఎవరు గెలిచినా పాత కక్షలు తప్పవు.. అదే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో నడిస్తే పొలిటికల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనే బలమైన భరోసాను ఇస్తూ కేడర్ నైరాశ్యాన్ని క్యాష్ చేసుకుంటోంది. పెద్దగా ప్రెస్ మీట్లు పెట్టకుండానే, ఊళ్లల్లో ప్రత్యామ్నాయ శక్తులుగా బీజేపీ స్థానిక నాయకత్వం ఎదుగుతోంది.

 కుల సంఘాల ద్వారా  మైక్రో-లెవెల్  సోషల్ ఇంజనీరింగ్ 

ఉత్తర తెలంగాణ రాజకీయాలను ఎప్పుడూ కుల సమీకరణాలే శాసిస్తాయి. దీనిని పక్కాగా అర్థం చేసుకున్న కాషాయ దళం.. మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ, గౌడ, ముదిరాజ్ వంటి బలమైన బీసీ సామాజిక వర్గాలతో పాటు దళిత, గిరిజన ఉపకులాల స్థానిక పెద్దలను టార్గెట్ చేసింది. గ్రామంలో ఐదారు కుటుంబాలను లేదా పది ఓట్లను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ఈ కీలక వ్యక్తులను నేరుగా కలిసి కలుపుకుపోతోంది. వారి సామాజిక సమస్యల పరిష్కారానికి తాము ఉన్నామంటూ ఒక సామాజిక అనుబంధాన్ని  ముమ్మరంగా పెంచుకుంటోంది. ఈ మైక్రో లెవెల్ ప్లానింగ్ వల్ల పైకి ఓటర్లు సైలెంట్‌గా ఉన్నా, లోపల మాత్రం కాషాయం వైపు లీన్ అవుతున్నారు.

 యువత, రైతు గ్రూపులపై ప్రత్యేక ఫోకస్ 

గ్రామాల్లో ఉండే యువజన సంఘాలు, డిజిటల్ నెట్‌వర్క్‌లను బీజేపీ లీడర్లు చాకచక్యంగా వాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పతాక స్థాయి పథకాలు, ఉపాధి అవకాశాలను వివరిస్తూ వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. అటు వ్యవసాయ రంగంలో స్థానిక రైతు గ్రూపులతో మమేకమవుతూ.. పంటల కొనుగోళ్లు, స్థానిక మౌలిక వసతుల లోపాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ లఫడాలుగా ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఫలితంగా, యూత్‌ క్లబ్‌లు, రచ్చబండల దగ్గర పొలిటికల్ డిస్కషన్స్ నెమ్మదిగా బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయి. 

 వచ్చే ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా 

ఈ నిశ్శబ్ద ఆపరేషన్ అంతా తక్షణ హడావుడి కోసం కాదు, రాబోయే  సార్వత్రిక ఎన్నికల నాటికి ఉత్తర తెలంగాణను బీజేపీకి బలమైన కోటగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ అధికార బలంతో, బీఆర్ఎస్ పాత క్యాడర్ బలంతో కొట్టుకుంటుంటే.. బీజేపీ ఏకంగా  ఓటు బ్యాంక్ పునాదులనే  మార్చేస్తోంది. క్షేత్రస్థాయిలో కుల సంఘాల మద్దతు, తటస్థుల భరోసా తోడైతే, రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీని ఢీకొట్టడం ప్రత్యర్థులకు అంత సులువు కాదనేది విశ్లేషకుల అంచనా.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget