అన్వేషించండి

AP BJP : ఏపీపై బీజేపీ హైకమాండ్ దృష్టి - త్వరలో 13వేల గ్రామాల్లో పాదయాత్రలు !

ఏపీపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ నేతలకు వరుసగా టాస్క్‌లు ఇస్తోంది. త్వరలో 13వేల గ్రామాల్లో పాదయాత్రలు చేయనున్నారు .

AP BJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు .. రాష్ట్రంలో తమదైన ముద్ర వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా రాష్ట్రంలోని 13 వేల గ్రామాల్లో పది వేల కిలోమీటర్ల మేర పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయంచారు. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనుంది. ఇటీవల వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు పోరాటం ఉద్ధృతం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కూడా తరచూ ఏపీలో పర్యటిస్తున్నరు. జనవరి రెండో వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పర్యటించబోతున్నారు.  ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ మరింత ఉద్ధృతంగా కార్యకలాపాలను నిర్వహించాలనుకుంటోంది. 

13 వేల గ్రామాల్లో పాదయాత్రలు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు గ్రామ, గ్రామానికి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్ర బీజేపీ నుంచి వస్తున్న సూచనల మేరకు పాదయాత్రలకు రెడీ అవుతున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రతీ గ్రామంలోనూ భారతీయ జనతా పార్టీ ఉనికిని చాటినట్లవుతుంది. బీజేపీపై అభిమానం ఉన్నప్పటికీ .. సంస్థాగతంగా లేని నిర్మాణం వల్ల కొంత మంది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితిని పాదయాత్ర ద్వారా అధిగమించి గ్రామాల్లోని బీజేపీ అభిమానులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ పాదయాత్రలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం చేయడం ద్వారా.. ప్రత్యామ్నాయం తామేనన్న భావన ప్రజలకు కల్పించేలా బీజేపీ పోరాటం ఉండనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు సక్సెస్ - ఆ స్ఫూర్తితో పాదయాత్రలు

ఇటీవల బీజేపీ వినూత్నంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదారు వేల సభలను నిర్వహించింది. భారీ బహిరంగసభ జోలికి వెళ్లకుండా కాలనీలు.. గ్రామాల్లో ఈ సభలను నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధాన పార్టీతో పోలిస్తే..  పార్టీ క్యాడర్ తక్కువే ఉన్నప్పటికీ.. ఉన్న క్రియాశీల కార్యకర్తలు, నేతలతోనే విస్తృతంగా నిర్వహించిన ఈ సమావేశాలపై మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఏపీ బీజేపీ ప్రధాన కారదర్శి విష్ణువర్దన్ రెడ్డి నేతృత్వంలో ఇవి జరిగాయి. పాదయాత్రల బాధ్యతలనూ ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా  బాధ్యతలను ఇప్పటికే ఆయనకు ఇచ్చారు. 

ఏపీలో బీజేపీ బలోపేతంపై హైకమాండ్ ప్రత్యేకదృష్టి !

జాతీయ రాజకీయాలు లేదా ఇతర కారణాలు ఏమైతేనేం ఇంత కాలం ... బీజేపీ హైకమాండ్ పెద్దగా ఏపీలో బీజేపీ బలోపేతంపై పట్టించుకోలేదు.కానీ ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీ నేతలకు వరుసగా టాస్క్‌లు ఇస్తున్నారు.. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు వరుసగా ఏపీకి వస్తున్నారు. అమిత్ షా కూడా వస్తున్నారంటే.. ఖచ్చితంగా ఏపీపై  బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టిందని నమ్ముతున్నారు.  ఇంత కాలం హైకమాండ్ పెద్దగా పట్టించుకోకపోతూండటంతో ఏపీ బీజేపీ నేతలకూ దిశానిర్దేశం లేకుండా పోయింది. ఇక ముందు అలాంటి పరిస్థితి ఉండదని.. ..  తెలంగాణ తరహాలో  పార్టీ ముందుకెళ్తుందనే విశ్వాసంతో ఆ పార్టీ నేతలున్నారు 

టాప్ హెడ్ లైన్స్

Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget