Bhuvaneswari Comments: చంద్రబాబుపై భువనేశ్వరి కామెంట్స్ మిస్‌పైర్- ఆడేసుకుంటున్న వైసీపీ- కౌంటర్ చేయలేకపోతున్న టీడీపీ
Bhuvaneswari Comments: కుప్పంలో భువనేశ్వరి కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీకి మాత్రం తలనొప్పిగా మారుతోంది.

Bhuvaneswari Comments On Chandra Babu : కుప్పం(Kuppam)లో 35 ఏళ్లుగా మావారిని గెలిపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో నేను నిల్చుంటాను గెలిపిస్తారా అంటూ నారా భువనేశ్వరి(Bhuvaneswari) చేసిన సరదా వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని నాలుగేళ్లుగా సవాల్ చేస్తూ వస్తున్న వైసీపీ ప్రచారానికి ఈ కామెంట్స్ టానిక్‌లా ఉపయోగపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ లీడర్లు టీడీపీ అధినేతపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఓటమి భయంతోనే చంద్రబాబు(CBN) కుప్పంలో పోటీ చేయకుండా ఆయన భార్యను పోటీకి నిలుపుతున్నారంటూ ఫైర్ బ్రాండ్ రోజా విమర్శించారు. చంద్రబాబు కుప్పంలో కూడా గెలవలేమని అర్థమైందంటూ చురకలు అంటించారు. ఆమె బరిలో దిగినా గెలవరంటూ మరో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ఎద్దేవా చేశారు.
నోరుజారిన భువనేశ్వరి
ప్రజాజీవితంలో ఉన్నవారు సరదాగా మాట్లాడినా ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. వారు ఏ ఉద్దేశంతో అన్నారో ప్రత్యర్థులకు అనవసరం...వాటిని తమకు నచ్చినట్లు అన్వయించుకుని లబ్ధిపొందేందుకు యత్నిస్తుంటారు. ఇలా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Bhuvaneswari) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. బుధవారం కుప్పంలో పర్యటించిన భువనేశ్వరి..అక్కడి ప్రజలతో సరదా మాట్లాడారు. చంద్రబాబును 35ఏళ్లుగా గెలిపిస్తున్నారు కదా..ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ ఆమె అక్కడ ఉన్నవారిని అడిగారు.
దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. కుప్పంలో చంద్రబాబు పనైపోయిందని భువనేశ్వరి ప్రసంగం చూస్తేనే అర్థమవుతోందని మేం ఇన్నాళ్లు ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో ఇప్పుడు భువనేశ్వరి కూడా అదే చెప్పారని మంత్రి రోజా(Roja) వ్యాఖ్యానించారు. "చంద్రబాబుకు విశ్రాంతి తీసుకునే వయసొచ్చింది... కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉంది అని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పనైపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుందని రోజా అన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారని ఆమె విమర్శించారు. ఈ నెల 26న సీఎం జగన్ కుప్పం ప్రజలకు హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నారని రోజా స్పష్టం చేశారు. వైకాపా పాలనలో కుప్పం సహా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్(Jagan) 175 సీట్లకు 175 గెలవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు.
అంబటి ఎద్దేవా
భువనేశ్వరి వ్యాఖ్యలపై మరో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) సైతం విమర్శలు గుప్పించారు. కుప్పంలో భువనేశ్వరి పోటీ చేసినా ఓటమి తప్పదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని, రాజ్యసభలోనూ, కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇప్పించలేక పోయారన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కుప్పం ప్రజలకు మంచినీళ్లు ఇస్తోందని చెప్పారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కుప్పం ప్రజలకు మంచినీళ్లు ఇస్తోందని చెప్పారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు.
తెలుగుదేశం కౌంటర్
రోజా, అంబటి వ్యాఖ్యలపై అటు తెలుగుదేశం నేతలూ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం(TDP) కార్యకర్తలను చూసి భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలపైనా రోజా, అంబటి రాంబాబు మాట్లాడటం ఆమె దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. నగరిలో సీటు దక్కదన్న ఆందోళనలో ఉన్న మంత్రి రోజా...జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదని...అందుకే భువనేశ్వరి వ్యాఖ్యలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక రాంబాబు సీటు జగన్ ఎప్పుడో చింపేశారని ఆ విషయం ఆయనకే అర్థంకావడం లేదన్నారు,చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేసినా కుప్పంలో ఓటమి తప్పద ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని, రాజ్యసభలోనూ, కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇప్పించలేక పోయారన్నారు.
చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన ఈసారి కుప్పంలో కూడా గెలవడం కష్టమని ఎప్పటి నుంచో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. జగన్ యువకుడని విజన్ ఉన్న లీడర్ అని ప్రొజెక్టు చేసుకుంటున్నారు. ఆ విమర్శలకు చంద్రబాబు తన యాక్టివ్ పాలిటిక్స్‌తో ప్రూవ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు భువనేశ్వరి చేసిన కామెంట్స్ మాత్రం వైసీపీ వాదనకు బలాన్ని ఇచ్చాయి. సరదాగా చేసిన కామెంట్స్ అని చెబుతున్నప్పటికీ వాటిని సమర్థించుకునేలా లేవని టీడీపీ నేతలే అంటున్నారు. కచ్చితంగా ఇలాంటి కామెంట్స్‌తో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని విశ్లేషిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

