అన్వేషించండి

Bandi Sanjay: మీ స్క్రిప్ట్‌ రైటర్‌ను మార్చుకోండి పప్పుజీ! - రాహుల్ గాంధీకి బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేల్చుతున్నాయి.

Bandi Sanjay: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలకు కారణమయ్యాయి. పాత అసెంబ్లీ భవనంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..  వాజ్‌పేయీ హయాంలో ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగిందన్నారు. ఈ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, తెలంగాణ, ఏపీ విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రజలు సంతృప్తిపర్చలేకపోయిందని మోదీ అన్నారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేపోయిందని, మరోవైపు ఏపీ ప్రజలుసైతం తీవ్ర ఇబ్బంది పడ్డారని మోదీ అన్నారు. 

దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడడం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమేనని సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్‌ చేశారు. దీనికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మీ స్క్రిప్ట్‌ రైటర్‌ను మార్చుకోండి పప్పుజీ అంటూ ఎక్స్‌ వేదికగా సమాధానమిచ్చారు. 1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధానిని ప్రశ్నిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకే ఓటు - రెండు రాష్ట్రాలు అని తొలిసారి పిలుపునిచ్చింది దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయినని అన్నారు. రాహుల్‌ గాంధీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు అందరూ తెలంగాణను మోసం చేశారని ధ్వజమెత్తారు. 

వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు నెహ్రూ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ - జెంటిల్‌మెన్‌ ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారని బండి సంజయ్‌ అన్నారు. 1969లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 369 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత రాబోయేది బీజేపీ ప్రభుత్వమని తెలిసి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారని బండి సంజయ్‌ విమర్శించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Telangana Economic situation :తెలంగాణ బడ్జెట్ 2026 - అప్పుల సుడిగుండంలో ఆరు గ్యారంటీల పయనం - రేవంత్, భట్టి జోడి మ్యాజిక్ చేస్తారా?
తెలంగాణ బడ్జెట్ 2026 - అప్పుల సుడిగుండంలో ఆరు గ్యారంటీల పయనం - రేవంత్, భట్టి జోడి మ్యాజిక్ చేస్తారా?
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget