News
News
X

Bandi Sanjay On KCR : బీజేపీ వస్తేనే తెలంగాణ తల్లికి విముక్తి - గడీలను బద్దలు కొడతామన్న బండి సంజయ్ !

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గద్దె దించి తీరుతామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మూడో విడత పాదయాత్రను ఆయన యాదాద్రి నుంచి ప్రారంభించారు.

FOLLOW US: 

Bandi Sanjay On KCR :    గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మూడో విడత సంగ్రామ యాత్ర యాదగిరి గుట్ట నుంచి ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో మాట్లాడారు. యాదాద్రి పేరుతో టీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ఉమ్మడి నల్లగొండలో బీజేపీ లేదని కొందరు విమర్శిస్తున్నారని, అయితే ఖమ్మం జిల్లాలో కూడా తమ బలమేంటో చూపిస్తామన్నారు. బీజేపీ గెలిచాక సీఎం ఎవరయినా తొలుత భాగ్యలక్ష్మి అమ్మవారినే దర్శించుకుంటామన్నారు. ప్రతి కార్యకర్త ఉగ్ర నరసింహ స్వామి అవతారమెత్తి కేసీఆర్ను గద్దెదించాలని పిలుపునిచ్చారు.  

కాళేశ్వరాన్ని నిండా ముంచింది కేసీఆరే ! 
  
కాళేశ్వరాన్ని నిండా ముంచిన ఘనత కేసీఆర్ కు దక్కిందని సంజయ్ విమర్శించారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చుంటే దేశం మొత్తం ఇప్పుడు బీజేపీని నిలదీసేదన్నారు.   ఏం మొఖం పెట్టుకుని కాళేశ్వరానికి జాతీయ హోదా అడుగుతున్నారని ప్రశ్నించారు. మొదటి విడత పాదయాత్రలో బీజేపీ అధికారంలోకి వస్తే... ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, రెండో విడతలో ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు అమలుచేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని బండి ప్రస్తావించారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్న విషయాన్ని  ప్రజలకు చెప్పి, అవగాహన కల్పించేందుకే మూడో విడత పాదయాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

తెలంగాణ ప్రజలపై రూ. నాలుగు లక్షల కోట్ల అప్పు ! 

 కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి జనం చేతికి చిప్ప ఇచ్చిండని బండి సంజయ్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు అగ్రకులాల పేదలను మోసం చేస్తున్నాడని విమర్శించారు.  ఎస్టీ రిజర్వేషన్ విషయంలోనూ టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తోందని, రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, క్యాసినో వ్యవహారాల్లో ఆ పార్టీ నేతలకు సంబంధముందని బండి సంజయ్ అన్నారు. నయీం వ్యవహారంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, డబ్బు ఏమైందో కేసీఆర్ సమాధానం చెప్పాలనిడిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నింటినీ కక్కిస్తామని చెప్పారు. 

బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ తల్లికి విముక్తి ! 
 
బీజేపీ అధికారంలోకి వచ్చాక కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందపెట్టి, బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని బండి హామీ ఇచ్చారు. బీజేపీకి తెలంగాణ సమాజం అండగా ఉందని, ఉద్యోగులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు బయటకు వచ్చి తమ పార్టీకి మద్దతివ్వాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే గడీల్లో బంధీ అయిన తెలంగాణ తల్లి విముక్తురాలవుతుందని  విశ్వాసం వ్యక్తం చేశారు.  బుక్కెడు బువ్వ కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గోస పడుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల్ల్లో పురుగుల అన్నం పెడుతున్నారని, అదే అన్నం కేసీఆర్ మనవడు తింటుండా అని బండి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం ఒరగబెట్టని కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేస్తాడని బండి సంజయ్ సటైర్ వేశారు. రాష్ట్రాన్ని సాధించుకున్నది అవస్థలు పడేందుకేనా అని సీఎంను నిలదీశారు. 
  
Published at : 02 Aug 2022 06:40 PM (IST) Tags: Bandi Sanjay praja sangrama yatra Trs vs bjp against KCR

సంబంధిత కథనాలు

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !

Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !

Pawan Kalyan: పదవులపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని

Pawan Kalyan: పదవులపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని

Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!

Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!

KTR On MODI : పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

KTR On MODI :  పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

టాప్ స్టోరీస్

Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్‌ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?

Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్‌ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!