అన్వేషించండి

YSRCP Balija Voters : బలిజ వర్గానికి వైసీపీలో సీట్లు లేవా ? రాయలసీమలో సామాజిక సమీకరణాలు దారి తప్పవా ?

YSRCP : రాయలసీమలో బలిజల ప్రభావం ఎక్కువ. వైసీపీలో ఒక్క టిక్కెట్ కూడా కేటాయించడం లేదు. సామాజిక సమీకరణాల లెక్క ఆ పార్టీలో తప్పుతోందా ?

YSRCP Balija Voters :   సామాజిక సమీకరణాలతో  టిక్కెట్లు ఖరారు చేస్తున్నామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాయలసీమలో బలమైన ప్రభావం చూపే బలిజలకు ఒక్క చోట కూడా చాన్స్ ఇవ్వకపోవడం.. సిట్టింగ్‌లుగా ఉన్న ఇద్దరికి టిక్కెట్లు నిరాకరించడం .. చర్చనీయాంశంగా మారుతోంది. బలిజలు ఆగ్రహిస్తే.. వైసీపీకి ఇబ్బంది ఎదురవుతుందన్న అంచనాలను హైకమాండ్ ఎందుకు పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. 

గ్రేటర్ రాయలసీమలో బలంగా బలిజలు

 గ్రేటర్ రాయలసీమలో బలిజ ఓటర్లు గణనీయంగా ఉంటారు.  గత ఎన్నికల్లో ఆ వర్గం వైసీపీకి మద్దతుగా నిలిచింది. జనసేన బరిలో ఉన్నప్పటికీ వారు జగన్ వెంటే నిలిచారు. ఈసారి టికెట్ల విషయంలో ఆ సామాజిక వర్గానికి అధికారపక్షం మొండిచేయి చూపించడంతో ఆ వర్గం ఆలోచనలో పడింది. కాపు సామాజికవర్గాన్నే  రాయలసీమలో బలిజలుగా చెబుతారు.  రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని కొన్ని నియోజకవర్గాలలో వారు ఎటు మొగ్గితే ఆ పార్టీదే విజయం.. ఈ జిల్లాలకు సంబంధించి గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ నుంచి విజయం సాధించారు. 
ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వెణుగోపాల్, చిత్తూరు ఎమ్మెల్యే అరణీ శ్రీనివాసులు బలిజ సామాజికవర్గ నాయకులే. 

గతంలో గెలిచిన ఇద్దరికీ ఈ సారి టిక్కెట్ నిరాకరణ

దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వెణుగోపాల్, చిత్తూరు ఎమ్మెల్యే అరణీ శ్రీనివాసులులకు ఈ సారి టిక్కెట్లు కేటాయించలేదు. . ఆరు జల్లాల్లోని 74 నియోజకవర్గాల్లో ఎక్కడా  బలిజ వర్గానికి చెందిన నేత పేరు వినిపించడం లేదు.  దర్శి, చిత్తూరుల్లో  రెడ్డి నేతలకు ఇంచార్జ్ పదవులు ఇచ్చారు. చిత్తూరు నుంచి విజయానందారెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలకు అవకాశం కల్పించింది. నిజానికి రాజంపేట ఎంపీ టిక్కెట్ బలిజలకే కేటాయిస్తూ ఉంటారు. కానీ వైసీపీ రెడ్డి వర్గానికి చెందిన మిథున్ రెడ్డికి కేటాయిస్తోంది. 

ఇరవై నియోజకవర్గాల్లో బలిజ ఓటర్ల ప్రభావం  

గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏకంగా పాతిక నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. అత్యదికంగా చిత్తూరు జిల్లాలో  ఉంారు.  రాజంపేట ఎంపీ సీటు పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓటర్లు ఉన్నారు. ఇక తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని తిరుపతి, గూడూరు, కాళహస్తి, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు.  బలిజ వర్గానికి చెందిన చిత్తూరు వైసీపీ కార్పొరేటర్లు..   అన్యాయం జరిగిందని, తమ సామాజిక వర్గాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. గ్రేటర్ రాయలసీమ కాపు సంఘం అధ్యక్షుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

ఎవరికైనా చాన్స్ ఇస్తారా ? 

  రాజంపేట పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరు అసెంబ్లీ , రాజంపేట పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేస్తుంది. ఆ లోక్‌సభ సీటు పరిధిలోని మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబల్లపల్లి, రాజంపేట, రైల్వే కొడూరు నియోజకవర్గాలలో మెజారటీ ఓటర్లు బలిజలే.  ఇప్పటికే ఆ వర్గానికి చెందిన కుల సంఘాల నేతలు.. తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బలిజలపై వైసీపీ వివక్ష చూపిస్తోందన్న ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్తున్నారు. ఆ వర్గానికి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Common Used Passcodes: 2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!
2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Maharastra CM: ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
Embed widget