అన్వేషించండి

KCR Political Plan : బీజేపీలో చేరికలు లేకపోవడానికీ కేసీఆరే కారణమా ? ఈటలది నిర్వేదమా ? రాజకీయమా ?

తెలంగాణలో అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారా ? ఈటల రాజేందర్ నిర్వేదానికి గురవుతున్నారా ?

 

KCR Political Plan :   తెలంగాణ సీఎం కేసీఆర్ కు అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉన్నారని ... మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు.  2018 ఎన్నికల్లో నాతో సహా 20 మందిని ఓడించేందుకు ప్రత్యర్థులకు కేసీఆర్‌ డబ్బులు ఇచ్చారంటున్నారు.  ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్‌ కమిటీ లేదు. బీజేపీలో జాయినింగ్‌ కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్‌ అవుతున్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆయన నిర్వేదాన్ని తెలియచేస్తున్నాయని కొందరు అంటూంటే... తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురు లేదని అన్ని పార్టీలు ఆయన గ్రిప్‌లోనే ఉన్నాయని దీంతో తేలిపోతుందని మరికొందరు అంటున్నారు. నిజంగానే కేసీఆర్ కు అన్ని పార్టీల్లో కోవర్టులున్నారా ? ఈటల  రాజేందర్ మాటలకు అర్థం చేతులెత్తేయడమేనా ?

తెలంగాణ రాజకీయాల్లో కోవర్టుల కలకలం !

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో కోవర్టుల అంశం పదే పదే చర్చకు వస్తోదంది. గతంలో కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో కోవర్టులున్నారనే వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు బీజేపీ నేత ఈటల రాజేంద్ర వంతు. కేసీఆర్‌కు చెక్‌ పెట్టాలని బీజేపీ ప్లాన్స్‌ చేస్తున్న తరుణంలో కోవర్టుల విషయం బయటకు రావడం కలకలం సృష్టిస్తున్నది. ఇంతకీ బీజేపీలో ఉన్న కోవర్టులెవరు? పార్టీ అంతర్గత సమాచారాన్ని, కీలక అంశాలను కెసిఆర్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నదెవరు? టీఆర్ ఎస్ పార్టీలో సుదీర్ఘంగా ఉండి బీజేపీలోకి వచ్చిన ఈటలకు కోవర్టులెవరన్న దానిపై స్పష్టత ఉందా? ఈటల లాంటి సీనియర్ ఎవరిని లక్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు? పార్టీలో ఈటలకు ఎవరెవరితో పొసగడం లేదు? ఇప్పుడీ అంశాలన్నీ బీజేపీలో చర్చనీయాంశమవుతున్నాయి. 

కాంగ్రెస్‌లో కోవర్టులెవరన్నదానిపై ఇప్పటికీ తెగని చర్చ !

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. టీఆర్ఎస్ కు కోవర్టులుగా పని చేస్తున్నారని కొంత మంది నేతలపై కాంగ్రెస్ క్యాడర్ మండి పడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ అంశంపై ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఇటీవల కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన కొంత మంది సీనియర్లు కోవర్టులని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై వారు మండిపడ్డారు. తమను కోవర్టులంటే అంగీకరించేది లేదని ఆగ్రహించారు. అయితే వీరు బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని తమ పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి చేశారన్న అభప్రాయాలు బలంగా వినిపించాయి. కారణం ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఈ కోవర్టుల పంచాయతీ ఇంకా తేలలేదు. 

గతంలో టీడీపీ మునిగిపోవడానికి కూడా కోవర్ట్ ఆపరేషనే కారణమన్న ప్రచారం !

రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉంది. కానీ కేసీఆర్ వ్యూహాత్మకంగా టీడీపీలో ఉన్న తన వారితో చేసిన కోవర్ట్ ఆపరేషన్ కారణంగానే .. ఓటుకు నోటు కేసు వచ్చిందని.., ఆ కారణంగానే టీడీపీ నిర్వీర్యం అయిందన్న ప్రచారం కొంత కాలంగా ఉంది. అయితే ఈ కోవర్ట్ ఆపరేషన్లు ఏవీ బయటకు రావు. రాజకీయాల్లో అంతర్గత ప్రచారం మాత్రమే. అందుకే టీడీపీ లోని కేసీఆర్ కోవర్టులు అన్నది కూడా... నిజానిజాలు తెలియనంతగా ప్రచారం జరుగుతూనే ఉంది. 

అన్ని పార్టీల్లోనూ కోవర్టుల భయం !

ప్రస్తుతం తెలంగాణలో అన్ని పార్టీల్లోనూ కోవర్టుల భయం ఉంది. బీజేపీలో ఇప్పటి వరకూ నిబద్దులైన నేతలు ఉంటారని అనుకుంటారు. కానీ ఈటల వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆ పార్టీలోనూ భయం ...ఆందోళన కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే.. ఇప్పుడు కేసీఆర్ ను చూసి అన్నిపార్టీల నేతలూ ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీలోనే ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితికి చేరుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Jagapathi Babu on Vijayendra Prasad | Ruslaan మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో జగపతిబాబు | ABP DesamThatikonda Rajaiah on Kadiyam Srihari | కడియం శ్రీహరిపై తీవ్రపదజాలంతో రాజయ్య ఫైర్ | ABP DesamNimmakayala Chinarajappa Interview | ఉభయ గోదావరిలో కూటమిదే క్లీన్ స్వీప్ | ABP DesamKL Rahul on Dhoni Impact | LSG vs CSK మ్యాచ్ తర్వాత ధోని గురించి మాట్లాడిన రాహుల్ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
War 2 Update: 'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
KL Rahul Comments On Dhoni: ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో
ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో "కేక్‌" వాక్ చేసిన రాహుల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Embed widget