అన్వేషించండి

Sharmila On Sakshi Media: సాక్షి మీడియాలో వాటా ఉంది- పుట్టిన గ‌డ్డ నుంచి డోస్ పెంచిన షర్మిల

AP PCC Chief Sharmila: షర్మిల డోస్ పెంచారు. ఈసారి సాక్షిమీడియా సంస్థలో తనకూ వాటాలున్నాయని చెప్పుకొచ్చారు. అలాంటి సంస్థ తనపై విమర్శలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

AP PCC Chief Sharmila: Comments On Sakshi : రోజుకో బాంబు పేలుస్తూ వైసీపీకి సమస్యగా మారిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరో బాణం వదిలారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్ మీడియా అయిన సాక్షిలో తనకూ భాగం ఉందంటూ ప్రకటించారు. తనపై రోజుకో జోకర్‌ను తీసుకొచ్చి విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తనపై ఎన్ని నిందలు వేసినా తాను మాత్రం వైఎస్‌ షర్మిలా రెడ్డినే అన్నారు. 

సాక్షిలో వాటాలు

తెలంగాణలో తనతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తుందని... తనపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారన్నారు షర్మిల. అదే సాక్షి సంస్థలో తనకూ భాగం ఉందన్నారు. వైఎస్సారే తనకు సగం భాగం ఇచ్చారని చెప్పారు. సగం భాగం ఉన్నా నాపై నా సంస్థ బురద చల్లుతుందని ఆవేదన చెందారు. తాను ప్రజల సమస్యల మాట్లాడుతున్నానని.. హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్నానని చెప్పారు. విలువలు ,విశ్వసనీయత లేకుండా దిగజారుతున్నారని అన్నారు. 

ఏం చేసుకుంటారో చేసుకోండి

తండ్రి వైఎస్‌ రక్తమే తనలో ఉందన్నారు షర్మిల. పులి కడుపున పులే పుడతుందని చెప్పుచొక్కారు. ఏపీ తన పుట్టినిల్లు అన్న షర్మిల... అందుకే ఇక్కడ రాజకీయాలు చేయడానికి వచ్చానంటూ చెప్పుకొచ్చారు. ఏం పీక్కుంటారో పీక్కోండని... ఎన్ని నిందలు వేస్తారో వేసుకోండని సవాల్ చేశారు. 

ఎలా పని చేయాలో చెప్పారు 

ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి ఈ కడప బిడ్డ. పులివెందుల పులి అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన షర్మిల తర్వాత వైసీపీ టార్గెట్‌గా డోసు పెంచారు. తెల్లని పంచే కట్టు మొహం నిండా చిరునవ్వుతో నేటికీ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. వైఎస్సార్ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించారన్నారు. వైఎస్సార్ పథకాలు పొందని గడపే లేదని అభిప్రాయపడ్డారు షర్మిల. పార్టీలకు అతీతంగా అందరూ ఆయన పథకాలు పొందారన్నారు. 

వైఎస్‌ మార్క్‌ రాజకీయం 

అలాంటి మార్క్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా వైఎస్‌ ఆర్‌ ఉండేవారని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆయన పథకాలే ఒక మార్క్ అని చెప్పుకచ్చారు షర్మిల. రైతులకు రుణమాఫీ వైఎస్సార్ మార్క్, 50 లక్షల మంది బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ వైఎస్సార్ మార్క్. 46 లక్షల పేదలకు పక్కా ఇళ్లు కట్టడం వైఎస్సార్ మార్క్ అంటూ పథకాలు పేర్లను వివరించారు. 

మాట తప్పడం మడమ తిప్పడం వైఎస్సార్ కి చేతకాదని అన్నారు షర్మిల. తనకు మేలు చేస్తే..జీవితాంతం గుర్తు పెట్టుకోవడం వైఎస్సార్ మార్క్ అన్నారు. తన అనుకున్న వాళ్లకు ప్రాణం సైతం ఇవ్వడం వైఎస్సార్ మార్క్. నమ్మిన వాళ్ళను మనసులో ఎప్పటికీ ఉంచుకోవడం వైఎస్సార్ మార్క్. ప్రజలకు అందుబాటులో ఉండటం వైఎస్సార్ మార్క్, పథకాలు అందుతున్నాయో లేదో చూడటం వైఎస్సార్ మార్క్ అంటూ వివరించారు. వైఎస్‌ బతికే ఉంటే కడప స్టీల్‌ వచ్చేదన్నారు. అదే పూర్తై ఉంటే కచ్చితంగా 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి అన్నారు. లక్ష మందికి పరోక్షంగా ఉపాధి దొరికేది అని అభిప్రాయపడ్డారు. 

నేటి పాలకుల కారణంగా కడప స్టీల్ ఒక కల గానే మిగిలిపోయిందని విమర్శించారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ప్రాజెక్ట్ ను విభజన హామీల్లో పెట్టిందని గుర్తు చేశారు. చంద్రబాబు 18 వేల కోట్లతో మళ్ళీ శంకుస్థాపన చేశారని... 5 ఏళ్లలో నిర్లక్ష్యం చేశారన్నారు. ఆ టైంలో జగన్ దీక్షలు కూడా చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యాక రెండు సార్లు శంకుస్థాపన చేశారని వివరించారు. కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ గా మార్చారని ఎద్దేవా చేశారు. 

రైల్వే లైన్ వద్దన్నారు

వైఎస్సార్ హయాంలో కడప నుంచి బెంగళూర్ వరకు రైల్వే లైన్ అనుమతి తెచ్చారని వివరించారు షర్మిల. కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్‌కు నిధులు కూడా తెచ్చారన్నారు. 25 కిలేమేటర్ల వరకు నిర్మాణం జరిగిందని... ఎస్సార్ మరణం తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టించుకునే వాళ్లే లేరన్నారు. జగన్ హయాంలో ఆ రైల్వే లైన్ అవసరం లేదని లేఖ రాశారని ఆరోపించారు. ఒక చిన్న లైన్ చాలని సర్దుకున్నారని విమర్శించారు. మట్టి బిందెను తీసుకొని బంగారు బిందె ఇచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు. . 

మోడీతో దోస్తీ

మోడీతో దోస్తీ చేసే మీరు ఎందుకు ఈ ప్రాజెక్టులను తేలేక పోయారని ప్రశ్నించారు షర్మిల. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోతే ఇంత వరకు మరమ్మత్తులు లేవన్నారు. రోడ్డున పడ్డ కుటుంబాలను పట్టించుకోలేదని ఆరోపించారు. వైఎస్సార్ తన జీవితంలో బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించారని... అలాంటి వ్యక్తి ఆశయాలను జగన్ నిలబెడుతున్నరా ? అని ప్రశ్నించారు. 

వైఎస్సార్ మైనారిటీలను ప్రేమించే వారు... ఇప్పుడు జగన్ మైనారిటీలపై బీజేపీ దాడులు చేస్తుంటే  స్పందించడం లేదని విమర్శించారు షర్మిల. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించలేనీ మీరు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారని నిలదీశారు. బీజేపీనీ అడిగే శక్తి లేదు. నిలదీసే దమ్ము కూడా లేదని తూర్పారబట్టారు. పోలవరం అడిగే సత్తా లేదు...హోదా కోసం కొట్లాడే పరిస్థితి లేదన్నారు. దేశంలో బీజేపీ వేరే అర్థం ఉంటే ఇక్కడ మాత్రం బాబు, జగన్, పవన్ అని విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో మన జాతకాలు మారాలని పిలుపునిచ్చారు. 

కడప నా పుట్టిన ఇల్లని చెప్పుకొచ్చిన షర్మిల. జగన్ ఎలా పుట్టారో తను కూడా అలానే పుట్టానన్నారు. జమ్మల మడుగు ఆసుపత్రిలో పుట్టినట్టు చెప్పుకొచ్చారు. జగన్‌కు నేను వ్యతిరేకి కాదన్నారు షర్మిల. ఇద్దరిదీ ఒకటే రక్తం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయారని ఆరోపించారు. ఇప్పుడున్న జగన్‌ను ఎప్పుడు చూడలేదన్నారు. ఆయనకు క్యాడర్‌కి, పార్టీకి తాను చేసిన సేవలు గుర్తు లేవన్నారు. తనపైనే స్టోరీలు అల్లుతున్నారని ఆవేదన చెందారు. రోజుకో జోకర్‌ను తీసుకొచ్చి బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. 

కొత్తగా వచ్చిన జోకర్ ప్రణబ్ ముఖర్జీ పేరు ప్రస్తావించారని తన భర్త వెళ్లి అనిల్‌ను కలిసినట్టు విమర్శలు చేస్తున్నారని అన్నారు షర్మిల. జగన్‌ను బయటకు రానివ్వద్దు లాబియింగ్ చేశామని కొత్త పుకార్లు సృష్టిస్తున్నరన్నారు. సాక్ష్యం చెప్పడానికి ప్రణబ్ లేరనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వీళ్ల కుట్రలకు అంతే లేదన్నారు. తనకు పదవి ఆకాంక్ష ఉంటే నాన్నను అడిగి తీసుకోనా అని ప్రశ్నించారు. వైసీపీలోనైనా పదవి తీసుకోనా అని చెప్పుకొచ్చారు. అప్పుడు అనిల్, భారతి రెడ్డితో కలిసి సోనియా వద్దకు వెళ్ళారు... మరి ఆమెకు తెలియకుండా ఎలా అడిగారని ప్రశ్నించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 : ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ Atideb Sarkar ప్రారంభోపన్యాసం | ABP DesamIdeas of India 2025 | ముంబైలో ప్రారంభమైన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు | ABP DesamBan vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP DesamKadiyam Costly Bonsai Plant | చెట్టు దుంగలా కనిపిస్తున్న ఈ మొక్క రేట్ ఎంతో తెలుసా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Andhra Pradesh Group 2 Exam: 23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
Sourav Ganguly Biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
Farmer Protest: రుణమాఫీ చేయాలే-గాంధీభవన్ మెట్లపై రైతు ధర్నా- వీడియో వైరల్
రుణమాఫీ చేయాలే-గాంధీభవన్ మెట్లపై రైతు ధర్నా- వీడియో వైరల్
Embed widget