News
News
X

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

ప్రభుత్వంపై ఇంత కాలం సాఫ్ట్‌గా వ్యవహరించిన ఏపీ బీజేపీ.. ఇప్పుడు ట్రాక్ మార్చింది. ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తాము కూడా ఉన్నామని ప్రజలకు సందేశం పంపుతోంది.

FOLLOW US: 

AP BJP :  బీజేపీ దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ బలం పుంజుకుంటోంది. బలం లేదనుకున్న దక్షిణాదిలోనూ మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. తెలంగాణలో అధికారానికి దగ్గ్గరగా ఉన్నామని ఆ పార్టీ చెబుతోంది. తమిళనాడులో అన్నాడీఎంకే స్థానాన్ని భర్తీ చేసేందుకు దూకుడుగా వెళ్తోంది. అయితే ఏపీలో మాత్రం పెద్దగా ఎప్పుడూ బీజేపీ పనితీరు వార్తల్లోకి రాలేదు. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి మారింది. ఆ పార్టీ పూర్తిగా ట్రాక్ మార్చింది. ప్రభుత్వంపై  దూకుడుగా పోరాటం చేయడానికి ఉత్సాహం చూపిస్తూండటంతో  ప్రత్యామ్నాయం రేసులో తాము కూడా ఉన్నామన్న ఓ బలమైన నమ్మకాన్ని ఏర్పరిచే ప్రయత్నం చేస్తోంది. ప్రజాపోరు సభలను అనుకున్నట్లుగా నిర్వహించి .. తమకు కమిట్‌మెంట్ ఉన్న క్యాడర్ ఉన్నారని నిరూపించగలిగారు. 

ప్రభుత్వంపై గతంలో లేని విధంగా పోరాటం !

ఏపీ అధికార పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీతో సన్నిహితంగా ఉంది. ఈ కారణంగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడలేని పరిస్థితి ఉండేది. కరోనా సమయంలో  కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడారు. ఓ దశలో కన్నా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కరోనా కిట్ల విషయంలో కన్నా చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యాయి. దీంతో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు కన్నాపై బీజేపీ అంతర్గత విషయాలపై ఆరోపణలు చేశారు. అయితే ఆ తర్వాత ఆ వేడి తగ్గింది. దీంతో  వైఎస్ఆర్‌సీపీ - బీజేపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లో పెరగడానికి కారణం అయింది. 

ప్రజాపోరుతో ఒక్క సారిగా ట్రాక్ మార్చిన బీజేపీ !

News Reels

ఢిల్లీ రాజకీయాల కోసం మూడేళ్ల పాటు సంయమనం పాటించిన బీజేపీ ఇప్పుడు ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అలుపెరుగకుండా విస్తృత కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు. మొదట ఉద్యోగాల భర్తీ మీద యువ ఆందోళన నిర్వహించారు. తరవాత ప్రజాపోరు పేరుతో గ్రామ, గ్రామాన.. వీధి వీధిన సమావేశాలు నిర్వహించారు. చిన్నవే అయినా ప్రజల్లో చొచ్చుకెళ్లే కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని భావిస్తున్న బీజేపీ తాము కూడా ప్రత్యామ్నాయమేనని ప్రజలకు సంకేతాలు పంపింది. ఇతర పార్టీలకు చాన్సిచ్చారని దేశ ప్రగతిలో పాలు పంచుకుంటున్న జాతీయ పార్టీగా..డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తమకూ ఓ చాన్సివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విష్ణువర్దన్ రెడ్డి నేతృత్వంలో సాగిన ప్రజాపోరు సభలతో మంచి మైలేజీ వచ్చిందని ఆ పార్టీ అభిప్రాయానికి వచ్చింది. 

సొంతంగానే ముందుకెళ్తున్న బీజేపీ !

బీజేపీకి జనసేనతో పొత్తు ఉంది. అయితే జనసేన పార్టీ కార్యకలాపాలు పవన్ కల్యాణ్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఉంటున్నాయి. లేకపోతే సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే కలసి వచ్చినప్పుడే జనసేన పార్టీతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మిగిలిన సందర్భంగా నేరుగా ప్రజల్లోకి వెళ్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వంపై పోరాటం చేయడం ద్వారా విపక్షాలు బలపడతాయి. ఇంత కాలం ఉన్న కొన్ని సమస్యలను బీజేపీ అధిగమించి ముందుకెళ్తోంది. 

ప్రభుత్వ వ్యతిరేక పోరులో మరిన్ని కార్యక్రమాలు !

ప్రజాపోరు సభలతో క్యాడర్‌ మొత్తంలో కదలికి తీసుకు రాగలిగిన నేతలు ఇప్పుడు...  మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే జాతీయ నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోంది. కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు తరచూ వస్తున్నారు. ముందు ముదు మరింతగా ప్రభుత్వంపై పోరాటం చేసి బలం పెంచుకోవాలనుకుంటున్నారు. యువనాయకత్వం చురుగ్గా ఉండటంతో ముందు ముందు మరింత మెరుగ్గా  తమ పోరాటం ఉంటుందని చెబుతున్నారు. 

Published at : 03 Oct 2022 12:18 PM (IST) Tags: Vishnuvardhan Reddy AP BJP YSRCP vs. AP BJP

సంబంధిత కథనాలు

వైఎస్‌ఆర్‌టీపీకి మంచి రోజులు వస్తాయా? షర్మిల అరెస్టు, దాడులతో మైలేజీ పెరిగిందా?

వైఎస్‌ఆర్‌టీపీకి మంచి రోజులు వస్తాయా? షర్మిల అరెస్టు, దాడులతో మైలేజీ పెరిగిందా?

అమ్మ బయలుదేరింది- రాజకీయం మొదలైందా ?

అమ్మ బయలుదేరింది- రాజకీయం మొదలైందా ?

No Teachers in Elections Duties : ఏపీలో టీచర్లకు బోధనేతర విధులకు సెలవు ! టీచర్ల కష్టాలను గుర్తించారా ? ఎన్నికల విధులకు దూరం చేసే వ్యూహమా ?

No Teachers in Elections Duties :  ఏపీలో టీచర్లకు బోధనేతర విధులకు సెలవు ! టీచర్ల కష్టాలను గుర్తించారా ? ఎన్నికల విధులకు దూరం చేసే వ్యూహమా ?

KCR Delhi Plan Delay : కేసీఆర్ ఢిల్లీ ప్లాన్లు మరింత ఆలస్యం - డిసెంబర్ అంతా తెలంగాణలోనే రాజకీయం ! ప్లాన్ మారిందా ?

KCR Delhi Plan Delay : కేసీఆర్ ఢిల్లీ ప్లాన్లు మరింత ఆలస్యం - డిసెంబర్ అంతా తెలంగాణలోనే రాజకీయం ! ప్లాన్ మారిందా ?

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్