అన్వేషించండి

ABP News-CVoter Survey: గోవాలో ఈ సారి హంగ్.. ఆమ్‌ ఆద్మీ, ఎంజీకే పార్టీలు కింగ్ మేకర్లయ్యే చాన్స్ !

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ సర్వేలో వెల్లడయింది. ప్రభుత్వ ఏర్పాటులో ఆమ్ ఆద్మీ, ఎంజీకే పార్టీలు కీలకమయ్యే అవకాశం ఉంది.

గోవా చిన్న రాష్ట్రమే కానీ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది. అందుకే గోవాలో ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. మనోహర్ పారీకర్ లేని ఎన్నికలు కావడంతో ఈ సారి ప్రజలు ఎవరికి పట్టం కడతారో అన్న చర్చ సహజంగానే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ఏబీపీన్యూస్ - సీ ఓటర్ చేసిన ప్రయత్నంలో హంగ్ అసెంబ్లీ వస్తుందనివెల్లడయింది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు.
ABP News-CVoter Survey: గోవాలో ఈ సారి హంగ్.. ఆమ్‌ ఆద్మీ, ఎంజీకే పార్టీలు కింగ్ మేకర్లయ్యే చాన్స్ !

మొత్తం 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 14 అసెంబ్లీ సీట్లు దక్కే అవకాశం ఉందని ఏబీపీన్యూస్ - సీ ఓటర్ తాజాగా చేసిన సర్వేలో తేలింది. భారతీయ జనతా పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. అయితే ఆ పార్టీ కాంగ్రెస్ కన్నా కాస్తంత ముందంజలో ఉంది. బీజేపీకి 14 నుంచి 18 సీట్లు లభించే అవకాశం ఉంది. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ప్రజల మనసుల్లో కాస్త చోటు సంపాదించబోతోంది. ఆ పార్టీకి 4 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కింగ్ మేకర్‌గా ఆమ్ ఆద్మీ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ పార్టీకి మూడు నుంచి ఏడు స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇతరులు సున్నా నుంచి రెండు చోట్ల గెలిచే అవకాశం ఉందని ఏబీపీన్యూస్ - సీ ఓటర్ సర్వేలో వెల్లడయింది.
ABP News-CVoter Survey: గోవాలో ఈ సారి హంగ్.. ఆమ్‌ ఆద్మీ, ఎంజీకే పార్టీలు కింగ్ మేకర్లయ్యే చాన్స్ !

ఇక ఓట్ల షేర్ ప్రకారం చూస్తే బీజేపీకి 30శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 23.6 శాతం ఓటర్ల మద్దతు ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీట్లను కాస్త తక్కువగా పొందినప్పటికీ 24 శాతం మంది ఓటర్లు ఆ పార్టీ వైపు ఉన్నారు. మిగతా ఓట్లను మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ఇండిపెండెంట్లు పొందే అవకాశం ఉంది. 

గోవాలో ఏ పార్టీకైనా పూర్తి మెజార్టీ రావడం కష్టమే. ఎంజీపీతో పాటు ఇండిపెండెంట్లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తూ ఉంటారు. సంకీర్ణాన్ని నడపడంలో మనోహర్ పారీకర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన నిజాయితీ పరుడైన లీడర్. ఈ కారణంగా మద్దతు ఇచ్చేవారు. ఆయన మరణం తర్వాత ఇప్పుడు సంకీర్ణాన్ని నడపాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రెండు, మూడు సార్లు సంక్షోభంలో పడటమే దీనికి నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేకపోవడంతో గోవా రాజకీయాలు ఎన్నికల ఫలితాల తర్వాత మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
AP Local body Elections: ఏపీ పరిషత్ ఎన్నికలు.. 50,815 నామినేషన్లు చెల్లుబాటు – అర్హుల జాబితా విడుదల
ఏపీ పరిషత్ ఎన్నికలు.. 50,815 నామినేషన్లు చెల్లుబాటు – అర్హుల జాబితా విడుదల
Vizianagaram ZP Elections: మజ్జి సహస్ర బీసీ కాదంటూ వైసీపీ ఫిర్యాదు.. చిన్న శ్రీనుకు పెద్ద టెన్షన్- మరోవైపు బొత్సకు షాక్!
మజ్జి సహస్ర బీసీ కాదంటూ వైసీపీ ఫిర్యాదు.. చిన్న శ్రీనుకు పెద్ద టెన్షన్- మరోవైపు బొత్సకు షాక్!
CM Chandrababu: పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
CBFC Leaks: ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
Embed widget