అన్వేషించండి
In Pics: వరద ప్రాంతాల్లోకి రేవంత్ రెడ్డి, సీఎం ముందే ఏడ్చేసిన బాధితులు - ఫోటోలు
Telangana Floods: రేవంత్ రెడ్డి కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు.
రేవంత్ రెడ్డి
1/9

తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో ముఖ్యంగా ఖమ్మం జిల్లా బాగా ప్రభావితం అయిన సంగతి తెలిసిందే. ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు.
2/9

సోమవారం రోడ్డు మార్గం ద్వారా రేవంత్ రెడ్డి కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావానికి దెబ్బతిన్న వరి పంటలను, పొలాలను పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర జిల్లా నేతలు ఉన్నారు.
3/9

‘‘వరద బాధితులను నేరుగా కలిసి ప్రభుత్వం తమకు అండగా ఉందన్న భరోసా కల్పించే ప్రయత్నం చేశాను. ఖమ్మం ఎఫ్ సిఐ రోడ్డు లో మున్నేరు వరద ప్రభావిత కాలనీలో బాధితులతో ముఖాముఖి మాట్లాడారు.
4/9

తక్షణ సాయంగా కుటుంబానికి రూ.10 వేలు అందజేయాలని నిర్ణయించాం. ఆదుకుంటాం…అండగా ఉంటాం’’ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
5/9

వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఖమ్మం వెళ్లే మార్గమధ్యంలో తెగిన పాలేరు లెఫ్ట్ కెనాల్ ను, దెబ్బ తిన్న పంట పొలాలను, మంత్రివర్గ సహచరులతో కలిసి పరిశీలించారు.
6/9

వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లాలో సమీక్ష నిర్వహించారు. ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు తెలుసుకుని తక్షణ సహాయం కోసం జిల్లాకు రూ.5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు.
7/9

ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు రూ.5 లక్షలు, పశువులు చనిపోతే రూ.50 వేలు, పంట నష్టం జరిగితే ఎకరాకు రూ.10 వేల పరిహారానికి ఆదేశాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్నీ విధాలా అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి వరద బాధితులకు పిలుపు ఇచ్చారు.
8/9

అంతకుముందు రేవంత్ రెడ్డి ఉదయం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించడం జరిగింది.
9/9

వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం, వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలి. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలి. తక్షణమే కేంద్ర సాయం కోరుతూ లేఖ రాయాలి. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయాలి. ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల సాయం చేస్తున్నాం’’ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Published at : 02 Sep 2024 07:14 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















