అన్వేషించండి
Chess Olympiad Winners: చెస్ ఛాంపియన్‌లతో ప్రధాని మోదీ, చారిత్రాత్మక విజయం అంటూ మరోసారి ప్రశంసలు
Chess Olympiad Winner Meets Modi: చెస్ ఒలింపియాడ్ 2024లో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించిన భారత చెస్ క్రీడాకారులను బుధవారం ప్రధాని మోదీని తన నివాసంలో కలుసుకున్నారు. మరోసారి అభినందించారు.

చెస్ ఒలింపియాడ్ విజేతలతో నరేంద్ర మోదీ
1/6

బుడాపెస్ట్‌లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత యువ చెస్ క్రీడాకారులు అద్భుతం చేశారు. చెస్ ఒలింపియాడ్ లో విజేతగా నిలిచిన భారత్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది.
2/6

టోర్నమెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్ళు బుధవారం ప్రధాని మోదీని తన నివాసంలో కలుసుకున్నారు.
3/6

అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు కూడా బంగారు పతకాలను సాధించడం, భారత్‌ను గర్వపడేలా చేయడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు ప్రధాని మోదీ.
4/6

ఛాంపియన్‌లతో ప్రధాని మోదీ కాసేపు మాట్లాడారు. ఎలాగైనా స్వర్ణంతో వస్తామని చెప్పినట్టుగానే భారత పురుషులు, మహిళల జట్లు స్వర్ణం తో తిరిగి వచ్చారని , భారత క్రీడా రంగంలో బంగారు అధ్యాయం మొదలయ్యిందని మోదీ అన్నారు.
5/6

జాన్ సుబెల్జ్‌పై ఇరిగేశీ నెగ్గగా, వ్లాదిమిర్ ఫెదోసీవ్‌పై గుకేశ్ విజయం సాధించాడు. దాంతో చెస్ ఒలింపియాడ్ లో భారత్ తొలిసారి స్వర్ణం కైవసం చేసుకుంది.
6/6

అమ్మాయిలలో దివ్య దేశ్‌ముఖ్, హారికలు ప్రత్యర్థుల్ని చిత్తు చేయగా.. ప్రజ్ఞానంద సోదరి వైశాలి డ్రా చేసుకుంది. వంతిక అగర్వాల్ నెగ్గడంతో భారత మహిళల జట్టు సైతం చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారి స్వర్ణం కైవసం చేసుకుంది.
Published at : 25 Sep 2024 10:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఐపీఎల్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion