విశ్వ క్రీడలు టోక్యో పారాలింపిక్స్ ఘనంగా ముగిశాయి. ఆదివారం సాయంత్రం ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ క్రీడల్లో భారత్ 19 పతకాలు సాధించింది. 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.
968 నుంచి పారాలింపిక్స్‌లో పోటీపడుతోన్న భారత్.. 2016 వరకూ మొత్తం 12 పతకాలు మాత్రమే సాధించగా.. ఇప్పుడు ఏకంగా 19 పతకాలు రావడం విశేషం.
ముగింపు వేడుకల్లో షూటర్ అవని లేఖరా భారత పతాకధారిగా వ్యవహరించి.. భారత్ బృందాన్ని నడిపించింది.
పతకాల పట్టికలో భారత్ 24వ స్థానంలో నిలిచింది. 2012 లండన్ పారాలింపిక్స్‌లో భారత్‌కి ఒకే ఒక పతకం దక్కగా.. 2016 రియో పారాలింపిక్స్‌లో ఆ సంఖ్య 4కి చేరింది.
అవని లేఖరా (షూటింగ్), సుమిత్ అన్టిల్ (జావెలిన్ త్రో), మనీశ్ నర్వాల్ (షూటింగ్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), కృష్ణ నగర్ (బ్యాడ్మింటన్) స్వర్ణ పతకాలు గెలిచారు.
నేషనల్ స్టేడియంలో కన్నులపండువగా జరిగిన ముగింపు ఉత్సవానికి జపాన్ యువరాజు అకిషినో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
4045 మంది అథ్లెట్లు బరిలో దిగిన ఈ పారాలింపిక్స్‌లో 207 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. బ్రిటన్ (124), అమెరికా (104) తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.
‘పారాలింపిక్స్‌తో ప్రపంచం స్ఫూర్తి పొందింది. భిన్నమైన వైకల్యాలు కలిగిన వారు ఇక్కడ రాణిస్తారు’ అన్న సందేశంతో ముగింపు కార్యక్రమాలను రూపొందించారు.
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!
In Pics: గేమ్ + గ్లామర్= సానియా మీర్జా
KL Rahul Wedding Gift: కేఎల్ రాహుల్‌కు రూ.2 కోట్ల BMW కారు, రూ.కోటి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ, ధోనీ!
Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్‌కు సానియా - బోపన్న జోడీ
KL Rahul Athiya Shetty Wedding Pics: క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి పెళ్లిసందడి చూశారా!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!
BBC Documentary Row: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ వివాదం, ఢిల్లీ వర్సిటీ వద్ద రచ్చ రచ్చ - పలువురు విద్యార్థుల అరెస్ట్