అన్వేషించండి
Team India Victory Parade: లక్షల గొంతులు ఒక్కటై, ఉప్పొంగిన భారతావని
Team India Victory Parade: విశ్వ విజేతలుగా నిలిచి కరేబియన్ దీవుల నుంచి స్వదేశానికి చేరుకున్న భారత్ జట్టు వాంఖడే స్టేడియంలో పొందిన గౌరవం అంతా ఇంతా కాదు. ఈ విజయం ఆటగాళ్ళదే కాదుప్రతి అభిమానిదీ.
విజయకేతనం ఎగరేసిన భారత క్రికెట్ వీరుల జాతీయ గీతాలాపన (Photo Source: Twitter/@ICC )
1/8

ఫ్యాన్స్‌కు రోహిత్ అభివాదం.. వాంఖడే స్టేడియంలో అభిమానులకు అభివాదం చేస్తున్న రోహిత్ శర్మ. ఈ కప్పును మీ కోసమే సాధించమనేలా ఉంది కదూ హిట్‌మ్యాన్ అభివాదం. రోహిత్ వైపు ఆసక్తిగా చూస్తున్న హార్దిక్ పాండ్యా... కుల్‌దీప్ యాదవ్.
2/8

వాంఖడేలో టీమిండియా ఆటగాళ్ల పరేడ్... అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న భారత ఆటగాళ్లు, సహాయ సిబ్బంది... త్రివర్ణ పతాకం కప్పుకుని విరాట్ ముందుకు నడుస్తుండగా.. మిగిలిన ఆటగాళ్లు విరాట్‌ను ఫాలో అయిపోయారు.
3/8

వందేమాతరం పాడుతూ... ముంబైలోని వాంఖడే స్టేడియంలో వందేమాతరం పాడుతున్న భారత ఆటగాళ్లు... కోహ్లీ సహా ఆటగాళ్లందరూ అభిమానులతో గొంతు కలిపి వందేమాతరం పాడారు. ఆ దృశ్యాలు... అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి.
4/8

ట్రోఫీతో కింగ్... టీ 20 ప్రపంచకప్‌ను సాధించాలన్న కలను సాకారం చేసుకున్న విరాట్ వాంఖడే స్టేడియంలో అభిమానులకు ఇలా ట్రోఫీని చూపిస్తూ సందడి చేశాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై కీలక ఇన్నింగ్స్ ఆడిన కింగ్...ఈ ట్రోఫీ భారత్‌కు రావడంలో కీ రోల్ ప్లే చేశాడు.
5/8

హేళన చేసినవారే పొగిడేలా... చూశారా.. ఐపీఎల్ ట్రోఫీ సాధించకపోయినా ప్రతిష్టాత్మకమైన టీ 20 ప్రపంచకప్‌నే సాధించాననేలా ముంబై వాంఖడేలోని అభిమానులకు టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీని చూపుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా
6/8

ట్రోఫీతో టీమిండియా ఆటగాళ్లు... వాంఖడే స్టేడియంలో ట్రోఫితో జాతీయ గేయాన్ని ఆలపిస్తుండగా లక్షలాది మంది గొంతు కలిపారు. టీ 20 ప్రపంచకప్‌ను ముందు పెట్టుకుని.. త్రివర్ణ పతాకాలు కప్పుకుని.. భారత ఆటగాళ్లు జనగణమణ ఆలపిస్తుండడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
7/8

అంబరమంత సంబరం... వాంఖడేలో టీమిండియా ఆటగాళ్లను సన్మానించే కార్యక్రమంలో బీసీసీఐ చేసిన ప్రత్యేక ఏర్పాట్లు అదిరిపోయాయి. క్రికెట్ ప్రేమికుల మదిలో నిలిచిపోయేలా... జీవితాంతం గుర్తుండేలా ఈ సంబరాలను నిర్వహించారు.
8/8

అందిన నజరానా.... టీ 20 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లకు, సహాయ సిబ్బందికి బీసీసీఐ రూ.125 కోట్ల నజరాన ప్రకటించింది. బీసీసీఐ కార్యదర్శి రూ. 125 కోట్ల చెక్కును అశేష అభిమానుల సమక్షాన టీమిండియా ఆటగాళ్లకు అందిస్తున్న క్షణాలివి...
Published at : 05 Jul 2024 10:04 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















