అన్వేషించండి
Team India Return: సగర్వంగా స్వదేశానికి వచ్చిన ఆటగాళ్ళు, ఎక్కడ చూసినా అభిమానుల సందడే
Team India Return: సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీం ఇండియా ఆటగాళ్ళు స్వదేశానికి చేరుకున్నారు. ఉదయం ఢిల్లీలో అడుగు పెట్టిన రోహిత్ సేనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

అభిమానులకు ట్రోఫీ చూపెడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ(Photo Source: Twitter/@ICC/@mufaddal_vohra )
1/6

టీ 20 ప్రపంచ కప్ సాధించి దేశ రాజధానికి చేరుకున్న విజేతలకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. న్యూఢిల్లీ ఎయిర్పోర్టు లో అభిమానులకు రోహిత్ శర్మ ట్రోఫీని చూపిస్తూ కనువిందు చేశాడు.
2/6

T20 ప్రపంచ కప్ 2024 లో ప్రతి ఆటగాడి పాత్ర మారువలేనిది . ఫైనల్ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ పట్టుకున్న అద్భుతమైన క్యాచ్ జట్టును సగర్వంగా గెలుపు వైపు నడిపించింది. నువ్వు పట్టుకున్నది బంతిని కాదు ట్రోఫీని అంటూ ఫాన్స్ స్కై పై అభిమానం కురిపించారు.
3/6

అపజయాలకు, విమర్శలకు అసలు స్పందించని హార్దిక్ పాండ్య సాధించిన విజయమే అతని గురించి మాట్లాడేలా చేసింది. అటు బౌలింగ్, ఇటూ బ్యాటింగ్ లో అదరగొట్టిన ఈ ఆల్ రౌండర్ ఈ విజయంతో తను జట్టుకు ఎంత అవసరమో తేల్చి చెప్పాడు.
4/6

అభిమానుల కేరింతల మధ్య ఆటగాళ్లు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తూ చిరునవ్వులు చిందించారు. ఫైనల్స్ లో అద్భుతంగా రాణించిన కోహ్లీ అభిమానులకు అభివాదం చేస్తు బస్ ఎక్కాడు.
5/6

భారత క్రికెటర్లను స్వాగతించడానికి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుమ్మిగూడిన అభిమానులకు రోహిత్ శర్మ తన చేతిలో ఉన్న కప్పు చూపిన ఆ క్షణం అందరూ ఆనంద పరవసులయ్యారు.
6/6

విజయంతో తిరిగి వచ్చిన ఆటగాళ్ళను చూసి ప్రకృతి కూడా పరవశించిందేమో పొద్దున్న నుంచి చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి, అటు అభిమానుల అభిమానంలోనూ , ఇటు చిరుజల్లుల పరవశం లోను టీం ఇండియా తడిసి ముద్దయ్యింది.
Published at : 04 Jul 2024 10:44 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion