అన్వేషించండి
Rishabh Pant: రీ ఎంట్రీ అదిరిపోయిందిగా , ధోనీ రికార్డును సమం చేసిన పంత్
IND vs BAN: చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. వన్డే తరహాలో 124 బంతుల్లో సెంచరీ సాధించాడు. ధోనీ సెంచరీల రికార్డును సమం చేశాడు.

రిషభ్ పంత్ రీ ఎంట్రీ అదుర్స్.. ధోనీ రికార్డు బ్రేక్
1/8

బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో చెలరేగిన పంత్ , 21 నెలల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశాడు.
2/8

టెస్టుల్లో ఆరో సెంచరీతో కదం తొక్కిన ఈ భారత కీపర్, చెన్నై టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.
3/8

90 టెస్టులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, తన టెస్టు కెరీర్‌లో 6 సెంచరీలు చేస్తే, రిషబ్ పంత్, 26 ఏళ్ల వయసులో 33వ టెస్టులో ఈ రికార్డును సమం చేశాడు.
4/8

టెస్టుల్లో 6 సార్లు 90ల్లో అవుటైన రిషబ్ పంత్ అవి కూడా సెంచరీలుగా మార్చుకొని ఉంటే రిషబ్ పంత్ కెరీర్‌లో 12 టెస్టు సెంచరీలు ఉండేవి.
5/8

చెన్నై టెసులో బంగ్లా బౌలర్లను ఏకంగా ఊచకోత కోసాడు. వన్డే తరహాలో దూకుడుగా బ్యాటింగ్ చేసిన రిషభ్. 128 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు.
6/8

2022, డిసెంబర్ 30న రిషబ్ పంత్‌కి కారు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ దృశ్యాలు చూసిన అభిమానులు రిషబ్ పంత్ బతకడమే చాలా పెద్ద అదృష్టమని అనుకున్నారు.
7/8

632 రోజుల తర్వాత అంటే 21 నెలల తర్వాత టెస్ట్ లలో రీ-ఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాతో మ్యాచులో మునుపటి పంత్ ను గుర్తుచేసేలా బ్యాటింగ్ చేశాడు.
8/8

మెహది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో పంత్ ఒంటి చేత్తో బాదిన సిక్సర్ అలాగే షకీబ్ అల్ హసన్ వేసిన 21 ఓవర్‌లో బౌలర్ తలపై నుంచి కొట్టిన సిక్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు పంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Published at : 21 Sep 2024 03:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
ఐపీఎల్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion