అన్వేషించండి
ఇంటికి పడమర దిశలో ఈ వస్తువులు ఉంటే కుటుంబంలో అందరిపైనా శని ప్రభావం ఉంటుంది!
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటి పడమర దిశలో శని దేవుడు ఉంటాడు. ఇక్కడ కొన్ని ఉంచకూడని వస్తువులు ఉంచితే శని దుష్ప్రభావాలు తప్పవంటారు వాస్తు శాస్త్ర నిపుణులు.
The Power of Saturn
1/6

అన్ని గ్రహాలకు వాటి ప్రత్యేక దిశ ఉంటుంది. అదేవిధంగా న్యాయ దేవత ,దండనాధికారి అయిన శని ప్రభావం ఇంటి పడమర దిశలో ఉంటుంది. మీరు ఈ దిశను అస్తవ్యస్తంగా ఉంచితే చెడు ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
2/6

శని దేవుడు పశ్చిమ దిశకు అధిపతి . శని దేవుడు ప్రసన్నుడైతే శుభ ఫలితాలను ఇస్తాడు. కానీ ఇంటి పశ్చిమ దిశలో చేసిన తప్పులు మీకు సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి పశ్చిమ దిశలో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోండి.
3/6

వాస్తు శాస్త్రం ప్రకారం పడమర దిశలో వంటగదిని నిర్మించకూడదు. ఈ దిశలో వంటగది ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు పెరుగుతాయి, ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఈ దిశలో నిర్మించిన వంటగదిలో ఎల్లప్పుడూ ఆహార ధాన్యాల కొరత ఉంటుందని నమ్ముతారు.
4/6

అలాగే పడమర దిశలో దేవాలయం, బాల్కనీ, బాత్రూమ్ , బెడ్ రూమ్ కూడా ఉండకూడదు. ఒకవేళ ముందే ఈ స్థలంలో ఇవి ఉంటే, పరిష్కారం కోసం మీరు నీటి మూలకాలకు సంబంధించిన వస్తువులను ఉంచండి లేదా ఫొటో పెట్టండి.
5/6

పడమర దిశలో మీరు ఫర్నిచర్ ఉంచవచ్చు. అయితే ఫర్నిచర్ ను శుభ్రంగా ఉంచాలని గుర్తుంచుకోండి. ఈ ప్రదేశంలో విరిగిన ఫర్నిచర్ , పనికిరాని వస్తువులను ఉంచకూడదు. ఇది ఇంటి శ్రేయస్సును నెమ్మదిగా తగ్గిస్తుంది.
6/6

వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఈ దిశను శుభ్రంగా మరియు చక్కగా ఉంచుకుంటే, శని అనుగ్రహం ఎప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. ఎందుకంటే ఈ దిశను సరిగ్గా నిర్వహించడం వల్ల జీవితంలో సమతుల్యత వస్తుంది
Published at : 11 Sep 2025 08:39 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















