అన్వేషించండి
Karnataka New Chief Minister: సిద్ధరామయ్య స్వగ్రామంలో పండుగ వాతావరణం, నృత్యాలు, పాలాభిషేకాలతో సంబురాలు!
Karnataka Chief Minister: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేసినప్పటి నుంచి ఆయన స్వగ్రామంలో సందడి మొదలైంది. నృత్యాలు చేస్తూ, టపాసులు పేలుస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.

సిద్ధరామయ్య స్వగ్రామంలో పండుగ వాతావరణం, నృత్యాలు, పాలాభిషేకాలతో సంబురాలు!
1/8

ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఖరారు, అధికారిక ప్రకటనే మిగిలి ఉంది.
2/8

సిద్ధరామయ్య పేరు ఖరారు చేసినట్లు న్యూస్ ఛానెళ్లు, పేపర్లు, వెబ్ సైట్లలో వార్తలు రావడంతో.. ఆయన స్వగ్రామం, బెంగళూరులోని ఆయన నివాసం వద్ద సంబురాలు మొదలయ్యాయి.
3/8

బెంగళూరులోని సిద్ధరామయ్య అధికారిక నివాసం వెలుపల గుమిగూడిన మద్దతుదారుల్లో ఆనంద వాతావరణం నెలకొంది.
4/8

సిద్ధరామయ్య చిత్ర పటానికి అభివాదం చేస్తూ.. నినాదాలు చేశారు. పోస్టర్లకు పాలాభిషేకం చేస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు.
5/8

సిద్ధరామయ్య సొంత జిల్లా మైసూర్. ఆయన స్వగ్రామంలోనూ పెద్ద ఎత్తున సంబురాలు జరుపుతున్నారు.
6/8

సిద్ధరామయ్య మద్దతుదారులు, శ్రేయోభిలాషులు రోడ్లపై ఉన్న చిత్రపటాల వద్ద టపాసులు పేల్చడం, నృత్యాలు చేయడం వంటివి చేస్తున్నారు. మిఠాయిలు పంచి పెడుతూ.. ఆనందాన్ని పంచుకుంటున్నారు.
7/8

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారులు స్థలాన్ని పరిశీలించారు.
8/8

2013లో సిద్ధరామయ్య తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ప్రదేశం ఇదే.
Published at : 18 May 2023 08:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
పాలిటిక్స్
లైఫ్‌స్టైల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion