అన్వేషించండి
Aadhaar Update for Children : పిల్లల ఆధార్ కార్డ్ ఎలాంటి ఫీజు లేకుండా అప్డేట్ చేయండిలా.. కానీ వ్యాలిడిటీ అప్పటివరకే
Aadhaar Updates without Fee : ఆధార్ అప్డేట్ నిబంధనలు: పిల్లల ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం పరిమిత సమయం వరకు మాత్రమే. అర్హతలు తెలుసుకోండి.
ఆధార్ ఇలా అప్డేట్ చేయండి
1/6

UIDAI అంటే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. ఈ సంస్థ ఇప్పుడు పిల్లల ఆధార్ అప్డేట్ విషయంలో ఒక పెద్ద అడుగు వేసింది. దీని ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ కార్డును పూర్తిగా ఉచితంగా అప్డేట్ చేయించవచ్చు. అయితే ఈ సౌకర్యం కేవలం పరిమితం.
2/6

సాధారణంగా పిల్లల ఆధార్‌లో ఫోటో లేదా చిరునామాకు సంబంధించిన సమాచారం పాతదిగా మారుతుంది. పాఠశాల మారినప్పుడు లేదా వయస్సు పెరిగినప్పుడు ఈ వివరాలను అప్‌డేట్ చేయడం అవసరం. ఇప్పుడు ఈ అప్‌డేట్‌ను ఎలాంటి రుసుము లేకుండా అప్డేట్ చేయవచ్చు.
3/6

UIDAI పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఇకపై ఎటువంటి రుసుము వసూలు చేయదు. ఈ సౌకర్యం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైంది. ఇది ఏడాది పాటు అమలులో ఉంటుంది. ఇప్పుడు 5 నుంచి 17 సంవత్సరాల పిల్లల ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేయవచ్చు.
4/6

5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల ఆధార్ను బాలా ఆధార్ అంటారు. ఈ వయసు ఉన్న పిల్లలనుంచి ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్, బయోమెట్రిక్ సమాచారం తీసుకోరు. ఎందుకంటే వారి శరీరం పూర్తిగా అభివృద్ధి చెందదు కాబట్టి. 5 సంవత్సరాల వయసు తర్వాత పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయడం అవసరం.
5/6

ఆధార్‌లో పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్ వంటి బయోమెట్రిక్ సమాచారం నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పిల్లల గుర్తింపును సురక్షితంగా అప్డేట్ చేస్తుంది. 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కూడా రెండవసారి ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయవచ్చు.
6/6

పిల్లల ఆధార్ను అప్డేట్ చేయడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళవచ్చు. దీనితో పాటు UIDAI అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా అప్డేట్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.
Published at : 06 Oct 2025 03:44 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
విశాఖపట్నం
సినిమా
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















