అన్వేషించండి
Satyabhama Serial - Varalakshmi Vratham 2024: వరంగల్‌లో 'సత్యభామ' వరలక్ష్మి వ్రతం... తెలుగు సంస్కృతికి నివాళిగా, ప్రజల మధ్యలో
Varalakshmi Vratam Celebration with Star Maa's Satyabhama Cast: తెలుగు సంప్రదాయం, సంస్కృతికి స్టార్ మా ఛానల్ ఎప్పుడూ ప్రాముఖ్యం ఇస్తుంది. తాజాగా 'సత్యభామ' సీరియల్ తారాగణాన్ని వరంగల్ తీసుకు వెళ్లింది.
వరంగల్‌లో నిర్వహించిన వరలక్ష్మి వ్రతం సంబరాల్లో 'సత్యభామ' సీరియల్ తారలు
1/7

తెలుగింటి సంప్రదాయాలు, సంస్కృతి ఆచారాలకు ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇటీవల వరలక్ష్మి వ్రతం సందర్భంగా సూపర్ హిట్ సీరియల్ 'సత్యభామ' తారాగణాన్ని వరంగల్ తీసుకు వెళ్లింది.
2/7

వరంగల్ ప్రజల దగ్గరకు 'సత్యభామ' హీరో హీరోయిన్లు నిరంజన్, ప్రేరణలను స్టార్ మా తీసుకు వెళ్లింది. ప్రజల మధ్య వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్బహించారు.
3/7

'సత్యభామ' సీరియల్ స్టార్ నిరంజన్ దరువు వేసి... వరలక్ష్మి వ్రతం చూడటానికి వచ్చిన ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. పంచెకట్టు, షర్టులో అచ్చమైన తెలుగు ఇంటి యువకుడిలా కనిపించారు.
4/7

'సత్యభామ' సీరియల్ క్యాస్ట్ తమ మొదటి వరలక్ష్మీ వ్రతాన్ని వరంగల్ ప్రజలతో కలిసి జరుపుకోవడంతో అక్కడి వారందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు 'సత్యభామ' తారల వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక సైతం వరంగల్‌లో జరిగింది.
5/7

వరలక్ష్మీ వ్రతం కార్యక్రమానికి భారీ సంఖ్యలో వరంగల్ ప్రజలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. భక్తి శ్రద్దలతో పవిత్రోత్సవాలు తిలకించారు. వరలక్ష్మి పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని నిర్వహించిన నిరంజన్, ప్రేరణ.
6/7

వరలక్ష్మీ వ్రతానికి హాజరైన మహిళలకు వాయనాలు అందించటంతో పాటుగా ప్రసాదాలు పంపిణీ చేసింది స్టార్ మా టీమ్. అయితే... 'సత్యభామ' హీరో వేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.
7/7

వరంగల్ వేదికగా జరిగిన 'సత్యభామ' సీరియల్ టీమ్ వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో తెలుగు సాంస్కృతిక సంపదను గుర్తు చేసేలా ప్రత్యేక తోలుబొమ్మలాట ప్రదర్శన నిర్వహించారు. తెలుగు సంస్కృతికి తాము ఇచ్చే నివాళి ఇది అని స్టార్ మా తెలిపింది.
Published at : 01 Sep 2024 01:23 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















