అన్వేషించండి
Satyabhama Serial Today November 26th Highlights :గంగ మెడలో తాళికడతానన్న మహదేవయ్య.. సత్య స్కెచ్ అదిరింది - సత్యభామ నవంబరు 26 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. చక్రవర్తి కొడుకే అని సత్యకి పూర్తి నిజం తెలిసిపోయింది. ఆ నిజాన్ని బయటపెట్టే ప్రయత్నాల్లో ఉంది... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

satyabhama serial november 24th episode Highlights
1/8

మహదేవయ్య న్యాయం చేయాలని..నా కొడుకుని నాకివ్వాలని ధర్నాకు దిగిన గంగని సపోర్ట్ చేసేందుకు నర్సింహ వస్తాడు. నా మొదటి కొడుకును తీసుకున్నాడు..రెండో కొడుకుని, నన్ను ఇలా గాలికి వదిలేశాడంటూ నినాదాలు చేస్తుంది. ఇంటి ముందు రచ్చ రచ్చ జరుగుతుంది.అధిష్టానం నుంచి మహదేవయ్యకి కాల్ వస్తుంది.. మొదటి భార్య పర్మిషన్ లేకుండా రెండో పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం , ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉండదు..నువ్వు ఈ సమస్య నుంచి బయటపడకపోతే నీకు MLA టికెట్ ఉండదని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. ఈ గంగ ఎవరో నాకు తెలియదంటూ తలపట్టుకుంటాడు మహదేవయ్య..
2/8

అధిష్టానం నుంచి మహదేవయ్యకి కాల్ వస్తుంది.. మొదటి భార్య పర్మిషన్ లేకుండా రెండో పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం , ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉండదు..నువ్వు ఈ సమస్య నుంచి బయటపడకపోతే నీకు MLA టికెట్ ఉండదని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. ఈ గంగ ఎవరో నాకు తెలియదంటూ తలపట్టుకుంటాడు మహదేవయ్య..
3/8

భోజనానికి వచ్చిన నందినితో..హర్ష ఎక్కడ అని అడుగుతుంది విశాలాక్షి. ఫైర్ అవుతుంది నందిని.. ఆ తర్వాత హర్ష వచ్చి కూర్చుంటే నందిని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. ఏం జరిగిందని విశాలాక్షి అడిగితే..మొత్తం చెబుతుంది నందిని. అర్థరాత్రి వరకూ మైత్రికి సేవలు చేస్తూ కూర్చున్నారంట అని ఫైర్ అవుతుంది.
4/8

ఆకలేస్తోంది అన్నం పెట్టండి అంటాడు మహదేవయ్య. గంగ దెబ్బకు నిజంగా బాపూ బ్రెయిన్ కి ఏమైనా అయిందా ఇంత రచ్చ జరుగుతుంటే తింటానండాడేంటి అంటాడు. భైరవి వచ్చి రెండో పెళ్లాం అని భైరవి అంటే... ఓ పసుపు తాడు తీసుకురా గంగ మెడలో కట్టి మీ అత్తమ్మ మాట నిజం చేస్తా అంటాడు.
5/8

మహిళా సంఘాలంతా గంగను సపోర్ట్ చేయడం స్క్రీన్ పై చూస్తారు. చూస్తుంటే MLA టికెట్ పోయే పరిస్థితి వచ్చిందని బాధపడతాడు..ఏదో చేయాలి అనుకుంటాడు. అయితే నాకు విడాకులు ఇవ్వు అప్పుడు గంగ ఒక్కతే భార్య అవుతుందని భైరవి అంటుంది
6/8

మావయ్యా ఓ పని చేద్దాం అంటుంది సత్య. క్రిష్ ఎలాగూ గంగ బిడ్డ కాదు మీ బిడ్డ..అందుకే DNA టెస్ట్ చేయించుకునేందుకు సిద్ధం అని మీడియా ముందు చెప్పండి అనే సలహా ఇస్తుంది సత్య. అప్పుడు నా చేతిలో గంగకు ఉంటుంది చూడు అని క్రిష్ అంటాడు. మహదేవయ్య సరే అంటాడు..
7/8

మైత్రి దగ్గరకు వెళ్లొచ్చిన విశాలాక్షి, విశ్వనాథం హర్షకి అక్షింతలు వేస్తారు. నందిని బాధకి అర్థముంది..మైత్రికి దూరంగా ఉండడం మంచిదని చెబుతారు. ఇంతలో మైత్రి నుంచి కాల్ వస్తే హర్ష కట్ చేస్తాడు. ఫస్ట్ టైమ్ హర్ష ఇలా నాతో ప్రవర్తించాడు.. ఆ నందినిని వదలనంటూ ఫ్రెండ్ తో చెబుతుంది మైత్రి..
8/8

సత్యభామ నవంబరు 27 ఎపిసోడ్ లో గంగ దగ్గరకు వెళ్లిన మహదేవయ్యతో సవాల్ చేస్తుంది. క్రిష్ నా బిడ్డ కాదంటున్నావ్ కదా.. అయితే నువ్వు నేను ఇద్దరం DNA టెస్ట్ చేయించుకుందాం అంటుంది..మహదేవయ్య షాక్ లో ఉండిపోతాడు..
Published at : 26 Nov 2024 09:40 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion