అన్వేషించండి
Brahmamudi Serial September 30th: కావ్య కంటపడకుండా తప్పించుకున్న అనామిక..దుగ్గిరాల ఫ్యామిలీకి ఆహారం అయిపోనున్న కళావతి!
Brahmamudi Today : లాస్ లో ఉన్న కంపెనీకి అవార్డ్ వస్తే మళ్లీ పరిస్థితి మారుతుందని రాజ్ ఆశపడుతున్నాడు..కానీ రాజ్ కి చెక్ పెట్టేందుకు కావ్యను రంగంలోకి దించింది అనామిక... సెప్టెంబరు 30 ఎపిసోడ్ హైలెట్స్
Brahmamudi September 30th Episode (Image Credit: star maa/Disney + Hotstar)
1/7

బ్రహ్మముడి సీరియల్ కీలక మలుపుతిరిగింది. కావ్య ఆత్మాభిమానంపై రాజ్ దెబ్బకొట్టడంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. కోడలిని తీసుకుని రమ్మని అపర్ణ కొడుకిని అడిగినా రాజ్ స్పందించడం లేదు.. మరోవైపు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లమని తల్లి కనకం చెప్పినా కావ్య తగ్గడం లేదు
2/7

ఉద్యోగం వేటంలో పడిన కావ్యను తమకు ఉపయోగించుకుని దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేసేందుకు కుట్రపన్నింది అనామిక. కావ్య డిజైన్లు అమ్మే మధ్యవర్తిని రంగంలోకి దించి..ఆ డిజైన్లు సామంత్ కంపెనీకి వచ్చేలా ప్లాన్ చేసింది
3/7

తన భర్తకి వ్యతిరేకంగా తాను పనిచేస్తున్నా అన్న విషయం తెలియని కావ్య ..సామంత్ కంపెనీకి డిజైన్లు ఇచ్చేందుకు ఉద్యోగంలో చేరింది. రాజ్ ఆలోచనల్లో మునిగితేలుతూ ఎట్టకేలకు డిజైన్లు వేసింది
4/7

కావ్య ఉంటే మనకు అవార్డ్ వస్తుందని అపర్ణ, సుభాష్ చెప్పినా రాజ్ మాత్రం..అవార్డు అయినా వదులుకుంటాను కానీ కళావతిని తీసుకురాను అని చెప్పేశాడు..అందుకే స్వయంగా తానే డిజైన్లు వేసే పనిలో పడ్డాడు..
5/7

నగల డిజైన్లు ఇంకా రాలేదా అని సామంత్ కంగారుపడుతుందే..వస్తాయిలే అంటుంది అనామిక...మేనేజర్ కూడా లోపలే ఉంటాడు.. ఇంతలో ఆ రూమ్ లోకి ఎంట్రీ ఇస్తోంది కావ్య...
6/7

కమింగప్ లో కావ్య వాళ్లను చూసేసిందనే డౌట్ వచ్చేలా చూపించారు..కానీ సీరియల్ లో ఇలాంటి కమింగప్ లు సహజమే.. సో..కావ్య అనామిక, సామంత్ ను చూడడం అనేది జరిగి ఉండదు..
7/7

డిజైన్లు సామంత్ కంపెనీకే చేరుతాయి కాబట్టి.. ఈ సారి అవార్డ్ ఎలాగూ సామంత్ కంపెనీకే వస్తుంది. ఆ డిజైన్లు కావ్య వేసిందని దుగ్గిరాల కుటుంబానికి తెలిస్తే చాలు..కళావతి వాళ్లకి ఆహారం అయిపోవడం ఖాయం. పైగా కావ్యను రాజ్ కి వ్యతిరేకంగా రంగంలోకి దింపానని అనామిక రుద్రాణికి చెప్పింది.
Published at : 29 Sep 2024 10:43 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















