అన్వేషించండి
Game On Movie: 'గేమ్ ఆన్' డిజిటల్ రైట్స్‌కు ఫ్యాన్సీ ఆఫర్... హ్యాపీగా ఉంది - హీరో గీతానంద్
గీతానంద్ హీరోగా నటించిన సినిమా 'గేమ్ ఆన్'. ఆయన తమ్ముడు దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించిన చిత్రమిది. ఫిబ్రవరి 2న (శుక్రవారం) సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరో చెప్పిన విశేషాలు...
హీరో గీతానంద్
1/6

''మా 'గేమ్ ఆన్' కథ చాలా కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా చేయాలని ట్రై చేశాం. జీవితంలో అన్నీ కోల్పోయిన హీరో... లూజర్ నుంచి విన్నర్ గా ఎలా మారాడు? అనేది కథ. ఆ ప్రయాణంలో భాగంగా వచ్చే టాస్కులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి'' అని గీతానంద్ చెప్పారు.
2/6

''దర్శకుడు దయానంద్ నా తమ్ముడు కావడంతో స్క్రిప్ట్ విషయంలో ఇద్దరం బాగా డిస్కస్ చేసుకున్నాం. మేమిద్దరం చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాం. తమ్ముడు స్టోరీ రాస్తే నేను యాక్ట్ చేసేవాడిని. లేదంటే నేను డైరెక్ట్ చేసేవాడిని. మా మధ్య బాండింగ్, సింక్ బాగా ఉంటాయి. ఈ సినిమాకు అది హెల్ప్ అయ్యింది. రియల్ టైం సైకలాజికల్ గేమ్ వరల్డ్ లోకి ప్రేక్షకులు వెళ్లేలా సినిమా తీశాం. యాక్షన్ సీక్వెనులు చాలా కొత్తగా ఉంటాయి'' అని గీతానంద్ చెప్పారు.
Published at : 01 Feb 2024 05:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















