అన్వేషించండి
Sitara Ghattamaneni: అంబానీ పెళ్లిలో సితార హంగామా - ఆరాధ్య బచ్చన్‌తో సెల్ఫీ, రణ్‌వీర్ సింగ్‌తో అల్లరి, సితూ పాప సందడి మామూలుగా లేదు
Sitara in Ambani Wedding: మహేష్ బాబు తన కూతురు సితార, భార్య నమ్రతతో కలిసి అంబానీ పెళ్లికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి సితార చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
Image Credit: sitaraghattamaneni/Instagram
1/8

Sitara Shared Ambani Weeding Pics: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు అయ్యాడు.
2/8

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు పది రోజుల పాటు ఘనంగా జరిగాయి. జూలై 12న వీరి మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లిలో నార్త్ నుంచి సౌత్ సినీ తారలంతా హాజరై సందడి చేశాడు.
3/8

ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరొద్కర్, కూతురు సితారతో కలిసి అంబానీ పెళ్లిలో పాల్గొన్నారు. ఈ వివాహ వేడుకలో సితార హంగామా మామూలుగా లేదు.
4/8

బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి సెల్పీలు దిగుతూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సితార పాప తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
5/8

ఇందులో సీనియర్ నటి రేఖ నుంచి రణ్‌వీర్ సింగ్, కియార అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా, ప్రియాంక-నిక్ జోనస్ కపుల్స్‌తో కలిసి సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది.
6/8

అలాగే మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, తన కూతురు ఆరాధ్యతో కలిసి సెల్ఫీ దిగింది. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అల్లరి చేసింది. ఇక ఈ ఫోటోలు చూస్తుంటే సితార అంబానీ పెళ్లి బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తుంది.
7/8

కాగా మహేష్ బాబు కూతురిగా సితారకు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ నెట్టింట తన ఫాలోవర్సని పెంచుకుంటుంది.
8/8

ఇప్పటికే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా సితార యమ క్రేజ్‌ను సంపాదించుకుంది. దానితో పాటు ఇటీవల ఓ జువెల్లరి యాడ్‌లో నటించిన గుర్తింపు సంపాదించుకుంది.
Published at : 15 Jul 2024 12:05 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















