నాగ శౌర్య హీరోగా నటిస్తున్న 'కృష్ణ వ్రింద విహారి' టీజర్ చూడగానే.. ఈ కొత్త అమ్మాయి ఎవరూ అని అనుకున్నారా?
ఈమె పేరు ‘షిర్లే సెటియా’. ఈ పేరు మనకు కొత్తేమో. కానీ, హిందీ పాప్ సాంగ్స్ ఇష్టపడేవారికి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఔనండి, ఇప్పటికే ఆమె తన గళంతో యావత్ ఇండియానూ ఫిదా చేసింది. యూట్యూబ్‌లో ఈమెకు ప్రత్యేకంగా 3.82 మిలియన్ సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు.
డామన్‌కు చెందిన ఈ బ్యూటీ.. ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన ఈమె టీ-సీరిస్ కంటెస్టెంట్‌లో పాల్గొంది.
ఆ తర్వాత షిర్లే.. యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన తొలి పాటను ఆమె.. తన బెడ్ రూమ్‌లో పాడింది. ఆ సమయంలో ఆమె పైజామా ధరించడంతో ఆమెకు ‘పైజామా పాప్ స్టార్’ అని పేరు వచ్చింది. టీ సీరిస్ కాంపిటీషన్‌లో షిర్లే విజేతగా నిలిచింది.
ఆక్లాండ్‌లోని కొన్ని రేడియో షోలు చేసిన షిర్లే.. 2016 సంవత్సరంలో తొలిసారిగా హైదరాబాద్, ముంబయిలో సంగీత కార్యక్రమాలు నిర్వహించింది.
బాలీవుడ్‌లో రానున్న సింగింగ్ సెన్సేషన్ షిర్లేనే అని ‘ఫోర్బ్స్’ పత్రికలోని ఓ పీచర్‌లో వెల్లడించడం గమనార్హం. అంతేగాక న్యూజిలాండ్‌లోని ముఖ్యమైన ఆర్టిస్టుల్లో ఒకరిగా కూడా ఆమెకు గుర్తింపు లభించింది.
పాటల్లోనే కాకుండా నటనలో కూడా తన సత్తా చాటాలని నిర్ణయించుకున్న షిర్లే.. ‘మస్కా’ (నెట్ ఫ్లిక్స్-సినిమా) ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘నికమ్మ’ చిత్రంలో అభిమన్యు దాసాని సరసన నటిస్తోంది.
‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ చిత్రం టీజర్‌లోని హాట్ హాట్ సీన్స్‌తో ఇప్పటికే ప్రేక్షకులను నోరెళ్లబెట్టేలా చేసిన ఈ బ్యూటీ గురించి తెలుసుకోడానికి కుర్రాళ్లు అప్పుడే సిద్ధమైపోయారు.
ఈమె గురించి మరింత తెలుసుకోవాలంటే.. ఒక్కసారి ఆమె యూట్యూబ్‌లోకి వెళ్లి ఆమె చానల్ Shirley Setia చూస్తే చాలు.
Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?
Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక
Urvashi Rautela: కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ - వైట్ గౌన్ లో ఊర్వశి రౌతేలా
Taapsee Pannu Photos: పింక్ ఫ్రాక్ లో ఢిల్లీ బ్యూటీ అదిరిపోలా
Raveena Tandon Photos: వన్నె తగ్గని అందమైన చందమామ రవీనా
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Virat Kohli Best IPL Innings: ఆ విధ్వంసానికి ఆరేళ్లు - మళ్లీ అలాంటి విరాట్‌ను చూస్తామా?
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు