అన్వేషించండి
Bigg Boss Gautham Krishna: 'సోలో బాయ్'తో హీరోగా బిగ్ బాస్ గౌతమ్ - టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ వేస్తే 30 వేలు... ఛాలెంజ్‌కి రెడీనా?
Solo Boy Telugu Movie: 'బిగ్ బాస్ 7' ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మిస్తున్న సినిమా 'సోలో బాయ్'. ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. అలాగే, టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ ఛాలెంజ్ కూడా!
'సోలో బాయ్' టైటిల్ సాంగ్ లాంచ్‌లో గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి
1/5

'బిగ్ బాస్ 7' కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ కథానాయకుడిగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ నిర్మిస్తున్న సినిమా 'సోలో బాయ్'. శ్వేతా అవస్థి కథానాయిక. పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జుడా షాండి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి 'ఆట' సందీప్ నృత్య దర్శకుడు. తాజాగా ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. హైలైట్ ఏమిటంటే... టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ ఛాలెంజ్ కూడా!
2/5

'సోలో బాయ్' సినిమా టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ గురించి నృత్య దర్శకుడు 'ఆట' సందీప్ మాట్లాడుతూ... ''హుక్ స్టెప్ ఛాలెంజ్ చేసిన వాళ్లకు మొదటి బహుమతిగా రూ. 30 వేలు, రెండవ బహుమతిగా రూ. 20 వేలు, మూడో బహుమతిగా రూ. 10 వేలు ఇస్తాం'' అని చెప్పారు. సినిమా గురించి మాట్లాడుతూ... ''నాకు ఈ సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చిన 'సెవెన్ హిల్స్' సతీష్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయన ఎంతో పాషనేట్ ప్రొడ్యూసర్. 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు 'సోలో బాయ్ టైటిల్ సాంగ్ నువ్వే చేయాలి' అని నాకు గౌతమ్ ఇచ్చిన మాటను ఇవాళ నిలబెట్టుకున్నాడు. గౌతమ్ డాన్స్ ఇరగదీశాడు. భవిష్యత్తులో కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు'' అని చెప్పారు.
Published at : 24 Aug 2024 06:11 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















