అన్వేషించండి
Sai Madhav Burra: సాయి మాధవ్ బుర్రా సూపర్‌విజన్‌లో... పొలిటికల్ లీడర్ కటౌట్ తగలబెట్టిన అవినాష్, సిమ్రాన్ చౌదరి!
Avinash Thiruveedhula Simran Choudhary Movie: ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా స్క్రిప్ట్ సూపర్‌విజన్‌లో... అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా కొత్త సినిమా మొదలైంది. ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా కొత్త సినిమా పూజతో మొదలైంది.
1/7

అటు సెంట్రల్... ఇటు తెలుగు స్టేట్స్... ప్రజెంట్ ఎటు చూసినా సరే పొలిటికల్ హడావిడి! ఒకవైపు కొందరు రాజకీయ నాయకులకు ప్రజలు నీరాజనాలు పడుతుంటే... మరొకవైపు ఇంకొందరిపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో పొలిటికల్ లీడర్ కటౌట్ సామాన్య ప్రజలు తగలబెట్టిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి విడుదలైంది. పూజతో సినిమా మొదలైంది. ఆ సినిమాకు స్కిప్ట్ సూపర్ విజన్ ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రాది కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే...
2/7

అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా ఓ సినిమా రూపొందుతోంది. దీనిని సిల్వర్ స్క్రీన్ సినిమాస్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ప్రొడక్షన్ 1గా శాంతనూపతి, ఆలపాటి రాజా, అవినాష్ బుయాని, అంకిత్ రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కార్తి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా స్క్రిప్ట్ సూపర్ విజన్, డైలాగులతో రూపొందుతోంది. హైదరాబాద్ సారధి స్టూడియోలో ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభమైంది.
Published at : 10 Jun 2024 04:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















