అన్వేషించండి
Vizag Carnival Photos: ఆర్కే బీచ్ రోడ్డులో వైజాగ్ కార్నివాల్ సందడే సందడి
విశాఖపట్నం నగరంలో ఈ నెల 28, 29 తేదీ లలో జి-20 శిఖరాగ్ర సదస్సు కార్యక్రమాలు నిర్వహించన్న సందర్భంగా వైజాగ్ కార్నివాల్ నిర్వహించారు.

వైజాగ్ కార్నివాల్
1/11

విశాఖపట్నం నగరంలో ఈ నెల 28, 29 తేదీ లలో జి-20 శిఖరాగ్ర సదస్సు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
2/11

ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక వై ఎమ్ సి ఎ నుంచి ఆర్కే బీచ్ వరకు వైజాగ్ కార్నివాల్ నిర్వహించారు.
3/11

జీ20 సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు రానున్నాదని, వారి కి కావలసిన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రులు తెలిపారు.
4/11

ముందుగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి జెండా ఊపి వైజాగ్ కార్నివాల్ ప్రారంభించారు.
5/11

ఇంఛార్జ్ మంత్రి విడదల రజని, మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్ నాథ్ సహా కీలక అధికారులు అంతా వైజాగ్ లోనే ఈ సదస్సు పూర్తయ్యే వరకూ ఉండబోతున్నారు.
6/11

సీఎం ఆదేశాల మేరకు సుమారు 157 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన విశాఖ నగర సుందరీకరణ పనులు చేపట్టినట్లు మంత్రులు తెలిపారు.
7/11

వైజాగ్ కార్నివాల్ లో నిర్వహించిన కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి.
8/11

వైజాగ్ కార్నివాల్ సెలబ్రేషన్
9/11

జీ20 సదస్సు సన్నాహక సమావేశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 28వ తేదీన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రులు తెలిపారు.
10/11

విశాఖలో జీ 20 సదస్సు సందర్భంగా నగరవాసులు పెద్ద ఎత్తున వైజాగ్ కార్నివాల్ కు తరలివచ్చారు.
11/11

ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ సెక్రటరీ శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున, మున్సిపల్ కమిషనర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్, మున్సిపల్, టూరిజం అధికారులు, కళాకారులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Published at : 26 Mar 2023 10:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion