అన్వేషించండి
Andhra Pradesh: కుంకీ ఏనుగుల సంరక్షణ బాధ్యత తీసుకున్న పవన్, తరలివస్తున్న దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర
Andhra Pradesh: 4 కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కర్ణాటక అప్పగించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో గజరాజులను ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్... వాటి సంరక్షణ బాధ్యత తనదేనన్నారు.
కుంకీ ఏనుగుల బాధ్యత తీసుకుంటా- కర్ణాటక ప్రభుత్వానికి పవన్ హామీ - తరలివస్తున్న గజబలం
1/23

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది.
2/23

మొత్తం ఆరు కుంకీ ఏనుగులు ఇవ్వవలసి ఉండగా, రెండు ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు, శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దఫా అందజేయనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలియచేసింది.
3/23

బుధవారం బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కుంకీ ఏనుగులను ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంతిర పవన్ కళ్యాణ్ సమక్షంలో అటవీ అధికారులకు అందించారు.
4/23

కుంకీ ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను, లైసెన్స్‌లు, వాటి సంరక్షణకు సంబంధించిన విధివిధానాల పత్రాలు పవన్‌కి అందజేశారు.
5/23

శాస్త్రోక్తంగా గజ పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వాధినేతలు కుంకీలను సాగనంపగా, పూల వర్షం కురిపిస్తూ పవన్ కళ్యణ్ ఆహ్వానం పలికారు.
6/23

నాలుగు ఏనుగులను కర్ణాటక అటవీశాఖ అధికారుల నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు.
7/23

దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించారు.
8/23

కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలలపాటు కుంకీ ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
9/23

ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికీ సిద్ధమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
10/23

కర్ణాటక ఇచ్చిన కుంకీ ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని పవన్ హామీ ఇచ్చారు.
11/23

కుంకీ అంటే పరిపూర్ణంగా శిక్షణ పొందిన అని అర్థం వస్తుంది. కుంకీ ఏనుగులు అంటే పరిపూర్ణంగా శిక్షణ ప ందిన ఏనుగు అని అర్థంలో వాడతారు.
12/23

కుంకీ ఏనుగులను వన్యమృగాల నియంత్రణ కోసం ఉపయోగిస్తారు.
13/23

ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కాలంలో ఉమ్మడి చిత్తూరు, ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతాల్లో అడవి ఏనుగులు ఊళ్లపై పడుతున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి.
14/23

ఊళ్లపై పడుతున్న అడవి ఏనుగుల నుంచి ప్రజలను, పంటలను రక్షించేందుకు ఈ కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతున్నారు
15/23

image 20
16/23

ఓ ఆరు కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది కూటమి ప్రభుత్వం
17/23

ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికీ సిద్ధమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
18/23

ఒప్పందంలో భాగంగా ఇప్పటికే నాలుగు ఏనుగులు అప్పగించారు. ఇంకా రెండు ఏనుగులు అప్పగించాల్సి ఉంది. త్వరలోనే వాటిని కూడా అప్పగించనున్నారు.
19/23

ఈ కుంకీ ఏనుగులు మావటి వాడు చెప్పే ఆదేశాలు విని పని చేస్తాయి.
20/23

ఇవి వన్యప్రాణులను తరిమివేయడమే కాదు, సంగీతం, పండుగలు, దేవాలయల ర్యాలీల్లో కూడా పాల్గొంటాయి.
21/23

కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, అసోం, పశ్చిమబెంగాళ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖంఢ్ రాష్ట్రాల్లో వీటికి ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఉన్నాయి.
22/23

తమిళనాడులోని మధుమలై, కర్ణాటక, కేరళ, అసోంలో ఎక్కువగా ఏనుగులకు శిక్షణ ఇస్తుంటారు.
23/23

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వాటిని పంపించారు.
Published at : 21 May 2025 04:18 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















