అన్వేషించండి
ఫోటోలు: ఆర్టీసీ బస్సులో చంద్రబాబు - మహిళల పక్కనే కూర్చొని మాటామంతీ
కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆర్టీసీ బస్సు ఎక్కారు
బస్సులో చంద్రబాబు
1/8

కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆర్టీసీ బస్సు ఎక్కారు.
2/8

మహిళల పక్కనే కూర్చొని వారితో కాసేపు మాట్లాడారు.
3/8

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరులో ఏపీఎస్ఆర్టీసీ బస్సులో చంద్రబాబు నాయుడు ప్రయాణం చేశారు.
4/8

‘భవిష్యత్ కు గ్యారెంటీ’ ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సులో ప్రయాణించి మహిళలతో మాట్లాడారు.
5/8

ఇందులో భాగంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నులపై మహిళలు తమ అవేదన వ్యక్తం చేశారు.
6/8

మహిళలు స్పందిస్తూ కరెంటు బిల్లులు వేలల్లో వస్తున్నాయని, తీవ్రమైన భారంగా మారాయని చెప్పారు.
7/8

టీడీపీ గతంలో ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై వీరు హర్షం వ్యక్తం చేశారు.
8/8

సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రకటించిన మహా శక్తి పథకం లబ్ధి గురించి చంద్రబాబు నాయుడు మహిళలకు వివరించారు.
Published at : 17 Aug 2023 06:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్

Nagesh GVDigital Editor
Opinion




















