అన్వేషించండి

Breaking News Live: రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వానికి పవర్ (పదవీ) హాలీడే ప్రకటిస్తారు: తులసిరెడ్డి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
YS Jagan Nandyal Tour, Telangana Paddy Issue AP Telangana Breaking News Live Updates Breaking News Live: రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వానికి పవర్ (పదవీ) హాలీడే ప్రకటిస్తారు: తులసిరెడ్డి
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

సంక్షేమ పాలనకే మొగ్గుచూపిన ఏపీ ప్రభుత్వం నేడు జగనన్న వసతి దీవెన రెండో విడత సాయాన్ని విడుదల చేయనుంది. నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలలో పర్యటించనున్నారు. నంద్యాలలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని.. రాష్ట్ర వ్యాప్తంగా 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లను జమ చేయనున్నారు. సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కగానే అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు.

నంద్యాల ఎస్‌పీజీ గ్రౌండ్‌ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 2021–22 విద్యా సంవత్సరానికి జగనన్న వసతి దీవెన రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ రూ.1,024 కోట్లు జమ చేస్తారు.  ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. పేదరికంతో ఏ విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఆలోచనతోనే విద్యార్థుల భోజన, వసతి ఖర్చులను ఏపీ ప్రభుత్వం చెల్లిస్తోంది. 

తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
ప్రతి ఏడాది జగనన్న వసతి దీవెన పథకం కింద రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, వైద్య, తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను సైతం ఏపీ ప్రభుత్వం భరిస్తోంది. ఈ నగదును విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు.

గత రెండు వారాలుగా వరుసగా పెరుగుతున్న ఇంధన  వాహనదారులకు నేడు ఊరట కలిగించాయి. గత మూడు నెలలుగా నిలకడగా ఉన్న ఇంధన ధరలు ప్రస్తుతం రోజువారీగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 8th April 2022) రూ.119.49 కాగా, డీజిల్ పై 87 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడంతో భారత్‌లో ప్రభావం చూపుతోంది. 

తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119 కాగా, డీజిల్‌‌పై 87 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.105.02 అయింది. 
వరంగల్ రూరల్ జిల్లాలో 3 పైసలు తగ్గడంతో పెట్రోల్‌ లీటర్ ధర రూ.119.18 కాగా, డీజిల్‌‌‌పై 3 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.67 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) పెరిగాయి. నేడు కరీంనగర్‌లో 30 పైసలు పెరిగి, పెట్రోల్ ధర రూ.119.64 కాగా, 13 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.105.36కు చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 8th April 2022)పై 75 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.121.81 కాగా, ఇక్కడ డీజిల్ పై 70 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.107.38 కి చేరింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు పెరిగాయి. 81 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 77 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.106.42గా ఉంది. 

గత నెలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 అయింది. తాజాగా రెండు రోజుల గ్యాప్ తరువాత బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకిచ్చాయి.  బంగారం ధర రూ.230 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,000కు చేరగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,370 అయింది. వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి ధర రూ.300 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.71,000 కు ఎగబాకింది.

ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు రూ.230 మేర పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 8th April 2022)  10 గ్రాముల ధర రూ.52,370 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,000కు పుంజుకుంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.71,000 అయింది.

విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధర రూ.200 మేర పెరగడంతో ఈ పట్టణాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,000 కు చేరింది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.71,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 

13:32 PM (IST)  •  08 Apr 2022

Jagananna Vasathi Deevena: ‘జగనన్న వసతి దీవెన’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్

Jagananna Vasathi Deevena: నంద్యాల ఎస్‌పీజీ గ్రౌండ్‌ వేదికగా 2021-22 విద్యాసంవత్సరానికి గానూ రెండో విడత ‘జగనన్న వసతి దీవెన’ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ నగదు జమ చేశారు. పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి-చదువు అని, నాడు-నేడుతో బడుల రూపు రేఖలు మారుస్తామన్నారు. పేద పిల్లల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పాను, పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని సీఎం జగన్ అన్నారు.

12:17 PM (IST)  •  08 Apr 2022

Drinking Water Problem: కలుషిత నీటి సమస్య - కొండాపూర్ ఆసుపత్రిలో 45 మంది బాధితులు

Drinking Water Problem: మాదాపూర్‌లో కలుషిత నీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. నీటిని తాగడంతో స్థానికులు వాంతులు, విరేచనాలు, జ్వరం లాంటి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. కొండాపూర్ ఆసుపత్రిలో ఇప్పటివరకు 45 మంది చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget