Yogi Adityanath Helicopter: యూపీ సీఎం యోగి చాపర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, కారణమేంటంటే
యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చాపర్‌ని వారణాసిలో అత్యవసంగా ల్యాండ్ చేశారు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు కారణమిదే..
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఓ పక్షి ఢీ కొట్టటం వల్ల ఉన్నట్టుండి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి లఖ్‌నవూ వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది.
అప్పటికప్పుడు యోగీ ఆదిత్యనాథ్‌ను సర్య్యూట్ హౌజ్‌కి తరలించారు. మరో చాపర్‌లో ఆయన లఖ్‌నవూ వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సీఎం యోగి ఆదిత్య నాథ్ క్షేమంగా ఉన్నారని, ఆయన సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదని అధికారులు స్పష్టం చేశారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయ పనుల్లో పురోగతిని పరిశీలించేందుకు యోగీ వచ్చారు. వాటితో పాటు మరి కొన్ని అభివృద్ధి పనులు, శాంతి భద్రతల్ని సమీక్షించారు. గతంలోనూ ఇదే విధంగా యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న చాపర్‌ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని అప్పట్లో అధికారులు తెలిపారు.
UP CM Yogi Adityanath's helicopter made an emergency landing at Varanasi airport after a bird-hit incident today. The CM and his staff are safe and will be travelling to Lucknow by another aircraft: DM Varanasi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 26, 2022
(file pic) pic.twitter.com/ucjR9cZdaH
ఈ పర్యటనకు ముందు స్వమిత్వ పథకంలో భాగంగా లఖ్‌నవూలో 11 లక్షల కుటుంబాలకు సంబంధించిన ఆన్‌లైన్ రూరల్ రెసిడెన్షియల్ రైట్స్ పత్రాలను అందజేశారు. లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఆయన ఈ పత్రాలను అందజేయటమే కాకుండా, రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించేందుకు గ్రామీణ ప్రజలూ కృషి చేయాలని సూచించారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి యూపీ గ్రామాల్లోని రెండున్నర కోట్ల మందికి ఈ పత్రాలు అందుతాయని హామీ ఇచ్చారు. ఈ పథకం కారణంగా ఇప్పటికే 34 లక్షల మందికి లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు.
లక్షా పదివేలకు పైగా గ్రామాల్లో డ్రోన్లతో ల్యాండ్ సర్వే చేయిస్తున్నామని, ఆగస్టులోగా ఇది పూర్తవతుందని చెప్పారు. మరికొంత మందికి గ్రామీణ ఆవాస హక్కుల పత్రాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రూరల్ రెసిడెన్స్ రికార్డ్ పథకం తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన యోగీ, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: IND vs IRE 1st T20: ఐపీఎల్ స్టార్లు, ఐర్లాండ్‌కు యుద్ధం! గెలుపెవరిదో నేడు చూసేద్దాం!!
Also Read: Jammu and Kashmir Encounter: నక్కి ఉన్న ఉగ్రవాదులను బయటకు లాగుతూ, కశ్మీర్ లోయలో వరుస ఎన్‌కౌంటర్‌లు